Iddari manasulu negamainam gaa

ఇద్దరి మనసులు నేకమైనఁ గా
Language

(॥పల్లవి॥)
ఇద్దరి మనసులు నేకమైనఁ గా-
కొద్దిక విరివో టొనరీనా

(॥ఇద్దరి॥)
చెలువుఁడు యేమో చింతించఁగ నే
కలయు మనుట సంగతు లౌనా
వలవనియలపుతో వడఁబడి యండఁగ
యెలమి నేఁ జెనకు టిం పవునా

(॥ఇద్దరి॥)
అదె పొడిఁ బడి పతి యసు రుసు రనఁగా
పదరి నేఁ బిలుచట పాడి యౌనా
నిదరుమోముతో నెరి విరి గుండఁగ
గుదిగొని నేఁ బైకొనఁ దగవా

(॥ఇద్దరి॥)
తమకించి యతఁడు దవ్వుల నుండఁగ
జమళిఁ గలయఁ బోతే సర వెవునా
తిమిరి శ్రీవెంకటదేవుఁ డతఁడె నను
ప్రమదమునఁ గలనెఁ బాసీనా

(||pallavi||)
iddari manasulu negamainam̐ gā-
kŏddiga virivo ṭŏnarīnā

(||iddari||)
sĕluvum̐ḍu yemo siṁtiṁcham̐ga ne
kalayu manuḍa saṁgadu launā
valavaniyalabudo vaḍam̐baḍi yaṁḍam̐ga
yĕlami nem̐ jĕnagu ṭiṁ pavunā

(||iddari||)
adĕ pŏḍim̐ baḍi padi yasu rusu ranam̐gā
padari nem̐ bilusaḍa pāḍi yaunā
nidarumomudo nĕri viri guṁḍam̐ga
gudigŏni nem̐ baigŏnam̐ dagavā

(||iddari||)
tamagiṁchi yadam̐ḍu davvula nuṁḍam̐ga
jamaḽim̐ galayam̐ bode sara vĕvunā
timiri śhrīvĕṁkaḍadevum̐ ḍadam̐ḍĕ nanu
pramadamunam̐ galanĕm̐ bāsīnā