Iddari lobala neevu yevadenu mechchidivi

ఇద్దరి లోపల నీవు యెవతెను మెచ్చితివి
Language

(॥పల్లవి॥)
ఇద్దరి లోపల నీవు యెవతెను మెచ్చితివి
అద్దలించక మాకిది యానతియ్యవయ్యా

(॥ఇద్ద॥)
కొమ్మ వొక్కరితె కేళాకూళిలో జలకేళిని
కమ్మి పెనఁగేయట్లాఁ గాఁగిటఁ గూడె
పమ్మి వేరొక్కతె వచ్చి పైకొని యది దెలిసి
దిమ్మరితనాన మోవితేనె చవిగొనెను

(॥ఇద్ద॥)
పడఁతి వొక్కతె నిన్ను పక్కపారిశాన వచ్చి
తొడలఁ బీడించి పట్టి తొలఁగఁదీసె
యెడచొచ్చి వేరొకతే ఇవ్వలిపారిసెమున
అడియాలమైనమాట లటు విన్నవించెను

(॥ఇద్ద॥)
మునిఁగి వచ్చి యొకతె మొక్కలాన నిన్నుఁ గూడి
మొనలచన్నుల నూఁది మొకమెత్తెను
ఘనుఁడ శ్రీవేంకటేశ కమ్మటి మఱియొకతె
మనసిజరతులను మాఱిపిళ్లాడెను

(||pallavi||)
iddari lobala nīvu yĕvadĕnu mĕchchidivi
addaliṁchaga māgidi yānadiyyavayyā

(||idda||)
kŏmma vŏkkaridĕ keḽāgūḽilo jalageḽini
kammi pĕnam̐geyaṭlām̐ gām̐giḍam̐ gūḍĕ
pammi verŏkkadĕ vachchi paigŏni yadi dĕlisi
dimmaridanāna movidenĕ savigŏnĕnu

(||idda||)
paḍam̐ti vŏkkadĕ ninnu pakkabāriśhāna vachchi
tŏḍalam̐ bīḍiṁchi paṭṭi tŏlam̐gam̐dīsĕ
yĕḍasŏchchi verŏgade ivvalibārisĕmuna
aḍiyālamainamāḍa laḍu vinnaviṁchĕnu

(||idda||)
munim̐gi vachchi yŏgadĕ mŏkkalāna ninnum̐ gūḍi
mŏnalasannula nūm̐di mŏgamĕttĕnu
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kammaḍi maṟiyŏgadĕ
manasijaradulanu māṟibiḽlāḍĕnu