Iddari jaanadanamu lemi seppuda mamma

ఇద్దరి జాణతనము లేమి చెప్పుద మమ్మ
Language

(॥పల్లవి॥)
ఇద్దరి జాణతనము లేమి చెప్పుద మమ్మ
గద్దరి యీ సేత లెందుఁ గన్నవి కావు

(॥ఇద్దరి॥)
చెలి దనపతిరూపు చిత్తరున వ్రాసి మోవి
బలుసోఁకు లటు వ్రాసి పకపక నవ్వఁగా
చెలువుఁ డంతటిలోన చేతి కడ్డి దీసుకొని
తలిరుఁబోఁడిరూపు తగులుగా వ్రాసె

(॥ఇద్దరి॥)
అంగన విభుని పేరి యాఁటదానిఁ జూచి చూచి
సంగతిగాని తుచ్చాలు నాకె నాడఁగా
ముంగిటరమణుఁ డా ముదిత చెలులమీఁద
యెంగిలితమ్ములము వేయించెఁ గదరమ్మా

(॥ఇద్దరి॥)
పడఁతి శ్రీవేంకటేశుపావురముఁ బాదమునఁ
జిడిముడిఁ దాఁకించి చెనకఁగాను
కడఁగి యాకె నతఁడు కలసి యింతిచిలుక
బడిసివేసి తనపంతము చేకొనెను

(||pallavi||)
iddari jāṇadanamu lemi sĕppuda mamma
gaddari yī seda lĕṁdum̐ gannavi kāvu

(||iddari||)
sĕli danabadirūbu sittaruna vrāsi movi
balusom̐ku laḍu vrāsi pagabaga navvam̐gā
sĕluvum̐ ḍaṁtaḍilona sedi kaḍḍi dīsugŏni
talirum̐bom̐ḍirūbu tagulugā vrāsĕ

(||iddari||)
aṁgana vibhuni peri yām̐ṭadānim̐ jūsi sūsi
saṁgadigāni tuchchālu nāgĕ nāḍam̐gā
muṁgiḍaramaṇum̐ ḍā mudida sĕlulamīm̐da
yĕṁgilidammulamu veyiṁchĕm̐ gadarammā

(||iddari||)
paḍam̐ti śhrīveṁkaḍeśhubāvuramum̐ bādamunam̐
jiḍimuḍim̐ dām̐kiṁchi sĕnagam̐gānu
kaḍam̐gi yāgĕ nadam̐ḍu kalasi yiṁtisiluga
baḍisivesi tanabaṁtamu segŏnĕnu