ఇద్దరి జాడలూఁ గంటి మిప్పుడే నేము
(॥పల్లవి॥)
ఇద్దరి జాడలూఁ గంటి మిప్పుడే నేము
ముద్దులు మోవులు మీలో మోఁపి గొణఁగితిరి
(॥ఇద్దరి॥)
మంతనాన నోతోడ మాటలాడేవేళ
యింతి బొమ్మముడి వెట్టె నేఁటికో కాని
చెంతల నందుకుఁ గానె చెప్పరాని తిట్టు దిట్టి
అంతలోఁ గాఁగిలించితి వౌ నయ్య నీవు
(॥ఇద్దరి॥)
ఆరజాన నాపె నీకు ఆకు మడి చిచ్చి యిచ్చి
యీరసానఁ గోపగించె నేఁటికో కాని
చేరి నీ వందుకు గానె చేయి వట్టి తోసుకొని
కూరిమి తొడపై నిడుకొంటివయ్య నీవు
(॥ఇద్దరి॥)
మంచముపై నుండి యాకె మలగుపై నొరగుతా
యించుకంత గోర నూఁదె నేఁటికో కాని
చంచుల శ్రీవెంకటేశ సన్నెరిఁగి కూడితివి
మించిన మీ నేరుపులు మే లయ్య నేఁడు
(||pallavi||)
iddari jāḍalūm̐ gaṁṭi mippuḍe nemu
muddulu movulu mīlo mom̐pi gŏṇam̐gidiri
(||iddari||)
maṁtanāna nodoḍa māḍalāḍeveḽa
yiṁti bŏmmamuḍi vĕṭṭĕ nem̐ṭigo kāni
sĕṁtala naṁdugum̐ gānĕ sĕpparāni tiṭṭu diṭṭi
aṁtalom̐ gām̐giliṁchidi vau nayya nīvu
(||iddari||)
ārajāna nābĕ nīgu āgu maḍi sichchi yichchi
yīrasānam̐ gobagiṁchĕ nem̐ṭigo kāni
seri nī vaṁdugu gānĕ seyi vaṭṭi tosugŏni
kūrimi tŏḍabai niḍugŏṁṭivayya nīvu
(||iddari||)
maṁchamubai nuṁḍi yāgĕ malagubai nŏragudā
yiṁchugaṁta gora nūm̐dĕ nem̐ṭigo kāni
saṁchula śhrīvĕṁkaḍeśha sannĕrim̐gi kūḍidivi
miṁchina mī nerubulu me layya nem̐ḍu