Iddari gunambu livi imtulaala

ఇద్దరి గుణంబు లివి ఇంతులాల
Language

(॥పల్లవి॥)
ఇద్దరి గుణంబు లివి ఇంతులాల
చద్దికిని వేఁడికిని సంగడించీని

(॥ఇద్ద॥)
వొలసి సూర్యునిలోన నుండేటియలవాటు
గలదుగన విరహాగ్నిఁ గలఁగఁ డతఁడు
పొలిఁతిదేహము మొదలఁ బూఁదీగెగనక ఇదె
వలరాచకాఁకచే వాడఁబారీని

(॥ఇద్ద॥)
సరిలేని పంచశరగురుఁడుగన పైకొన్న-
విరిబాణములకెల్ల వెఱవఁ డతఁడు
గరిమ నీచెలిమనసు గంటిలేనిదిగనక
వరుస లోలో మెఱుఁగువలెనె దాఁగీని

(॥ఇద్ద॥)
శ్రీవేంకటాద్రిపైఁ జెలఁగుదేవుఁడుగనక
యీవనిత కుచగిరుల నిటు మరిగెను
యేవంక నీచెలియ ఇందుకే కోరెఁగన
భావమున సంతసము పచ్చిదేరీని

(||pallavi||)
iddari guṇaṁbu livi iṁtulāla
saddigini vem̐ḍigini saṁgaḍiṁchīni

(||idda||)
vŏlasi sūryunilona nuṁḍeḍiyalavāḍu
galadugana virahāgnim̐ galam̐gam̐ ḍadam̐ḍu
pŏlim̐tidehamu mŏdalam̐ būm̐dīgĕganaga idĕ
valarāsagām̐kase vāḍam̐bārīni

(||idda||)
sarileni paṁchaśharagurum̐ḍugana paigŏnna-
viribāṇamulagĕlla vĕṟavam̐ ḍadam̐ḍu
garima nīsĕlimanasu gaṁṭilenidiganaga
varusa lolo mĕṟum̐guvalĕnĕ dām̐gīni

(||idda||)
śhrīveṁkaḍādribaim̐ jĕlam̐gudevum̐ḍuganaga
yīvanida kusagirula niḍu marigĕnu
yevaṁka nīsĕliya iṁduge korĕm̐gana
bhāvamuna saṁtasamu pachchiderīni