ఇద్దరము సరిగాదా ఇదివో నీకు
(॥పల్లవి॥)
ఇద్దరము సరిగాదా ఇదివో నీకు
పెద్దరికా లెక్కించేవు ప్రియమా నీకు
(॥ఇద్ద॥)
మగువకు నసమిచ్చి మాటలెల్లా నాడించి
తగవు దిద్దవచ్చేవు తగునా నీకు
యెగసక్కేల కిద్దరి నెదురుబడి నిలిపి
జిగిఁ బంతాలు రేఁచేవు చెల్లునా నీకు
(॥ఇద్ద॥)
వెంటఁ బెట్టుకొని వ్చి వెలఁది నెసకొలిపి
జంటలు సేయవచ్చేవు చలమా నీకు
దంటతనములు నేర్పి తారసిల్లఁ జేసి మమ్ము
వొంటి సిగ్గువరచేవు వుచితమా నీకు
(॥ఇద్ద॥)
పానుపుపై నాకెఁ బెట్టి జలిమి నన్నుఁ గూడేవు
పూని శ్రీవేంకటేశ అబ్బురమా నీకు
అనుకొని యిద్దరిని అక్కఁ జెల్లెండ్లఁ జేసి
నానఁ బెట్టేవు వలపు నగవా నీకు
(||pallavi||)
iddaramu sarigādā idivo nīgu
pĕddarigā lĕkkiṁchevu priyamā nīgu
(||idda||)
maguvagu nasamichchi māḍalĕllā nāḍiṁchi
tagavu diddavachchevu tagunā nīgu
yĕgasakkela kiddari nĕdurubaḍi nilibi
jigim̐ baṁtālu rem̐sevu sĕllunā nīgu
(||idda||)
vĕṁṭam̐ bĕṭṭugŏni vchi vĕlam̐di nĕsagŏlibi
jaṁṭalu seyavachchevu salamā nīgu
daṁṭadanamulu nerbi tārasillam̐ jesi mammu
vŏṁṭi sigguvarasevu vusidamā nīgu
(||idda||)
pānububai nāgĕm̐ bĕṭṭi jalimi nannum̐ gūḍevu
pūni śhrīveṁkaḍeśha abburamā nīgu
anugŏni yiddarini akkam̐ jĕllĕṁḍlam̐ jesi
nānam̐ bĕṭṭevu valabu nagavā nīgu