Iddaramu nunnaaramu imta saaladaa

ఇద్దరము నున్నారము ఇంత చాలదా
Language

(॥పల్లవి॥)
ఇద్దరము నున్నారము ఇంత చాలదా
పెద్దగాఁగ నడియాస పెనచఁగవలెనా

(॥ఇద్ద॥)
మొక్కితి నీకు నేను మొన్న నిన్నటిసుద్దికి
వక్కణలేల చెప్పేవు వద్దు వద్దు
కుక్కి తోసినట్టు నీకు గుట్టున నుంది వలపు
పిక్కటిల్లు తనుఁదానె పెడరేఁచవలెనా

(॥ఇద్ద॥)
నవ్వితి నీమోము చూచి నాలిసేసి ఇందాఁకా
జవ్వనమేల పట్టేవు చాలుఁజాలు
పువ్వులవలెనే నీకు పూఁచుక వున్నది తమి
రవ్వలయ్యీఁగాక తానే రారాఁపు వలెనా

(॥ఇద్ద॥)
ఆడితి నలమేల్మంగనని నన్నుఁ గూడితివి
యీడనే బాసలు సేసేవేల యేలఁ
వేడుకవలేనే శ్రీ వేంకటేశ నిండె మాట
వాడికలై వుండీఁగాక వ్రాసిచూపవలెనా

(||pallavi||)
iddaramu nunnāramu iṁta sāladā
pĕddagām̐ga naḍiyāsa pĕnasam̐gavalĕnā

(||idda||)
mŏkkidi nīgu nenu mŏnna ninnaḍisuddigi
vakkaṇalela sĕppevu vaddu vaddu
kukki tosinaṭṭu nīgu guṭṭuna nuṁdi valabu
pikkaḍillu tanum̐dānĕ pĕḍarem̐savalĕnā

(||idda||)
navvidi nīmomu sūsi nālisesi iṁdām̐kā
javvanamela paṭṭevu sālum̐jālu
puvvulavalĕne nīgu pūm̐suga vunnadi tami
ravvalayyīm̐gāga tāne rārām̐pu valĕnā

(||idda||)
āḍidi nalamelmaṁganani nannum̐ gūḍidivi
yīḍane bāsalu sesevela yelam̐
veḍugavalene śhrī veṁkaḍeśha niṁḍĕ māḍa
vāḍigalai vuṁḍīm̐gāga vrāsisūbavalĕnā