Iddaramu nomina nomiduvale phaliyimche

ఇద్దరము నోమిన నోమిటువలె ఫలియించె
Language

(॥పల్లవి॥)
ఇద్దరము నోమిన నోమిటువలె ఫలియించె
వద్దికి రావయ్యా నీవు వాకిట నుండనేల

(॥ఇద్ద॥)
కన్నుల నేఁజూచేచూపు కాఁడిపారు నీమేనైతే
అన్నిటా నాచూపే నాకు నాసరేఁచును
విన్నంవించేనాసొలపు వెస నీమర్మము సోఁకు
పన్ని యామాఁ టలే నాకుఁ బైతరవులౌను

(॥ఇద్ద॥)
చేరి నానవ్వులు నీకు చిత్తమెల్లఁ గరఁగించు
తారుకాణై నాకె నవ్వే తమివుట్టించు
నేరుపుల నాసన్నలు నిన్ను నీడకు రప్పించు
సారె నాసన్నలే నీతో సమరతికి నందిదచు

(॥ఇద్ద॥)
నెక్కొని నావినయము నిన్నుఁగడువలపించు
చిక్కి నావినయమే నీ సేవ యెంచు
గక్కన శ్రీవేంకటేశ కాఁగిలించితివి నన్ను
పక్కనున్న నాకూటమి పాయనీదు నిన్నును

(||pallavi||)
iddaramu nomina nomiḍuvalĕ phaliyiṁchĕ
vaddigi rāvayyā nīvu vāgiḍa nuṁḍanela

(||idda||)
kannula nem̐jūsesūbu kām̐ḍibāru nīmenaide
anniḍā nāsūbe nāgu nāsarem̐sunu
vinnaṁviṁchenāsŏlabu vĕsa nīmarmamu som̐ku
panni yāmām̐ ṭale nāgum̐ baidaravulaunu

(||idda||)
seri nānavvulu nīgu sittamĕllam̐ garam̐giṁchu
tārugāṇai nāgĕ navve tamivuṭṭiṁchu
nerubula nāsannalu ninnu nīḍagu rappiṁchu
sārĕ nāsannale nīdo samaradigi naṁdidasu

(||idda||)
nĕkkŏni nāvinayamu ninnum̐gaḍuvalabiṁchu
sikki nāvinayame nī seva yĕṁchu
gakkana śhrīveṁkaḍeśha kām̐giliṁchidivi nannu
pakkanunna nāgūḍami pāyanīdu ninnunu