Iddaramu niddarame yettu venaga tiyyamu

ఇద్దరము నిద్దరమె యెట్టు వెనక తియ్యము
Language

(॥పల్లవి॥)
ఇద్దరము నిద్దరమె యెట్టు వెనక తియ్యము
తిద్దేవానిఁ జూతము దేవరవు నీవు

(॥ఇద్ద॥)
మక్కువ నీతో నేను మాటలాడినట్టి మాట
అక్కడ నేల చెప్పితి వంతలోనే
పక్కన నప్పటి నాపెపంతము నాతోఁజెప్పేవు
నిక్కి యీపనులు దీర్చ నీకే భారము

(॥ఇద్ద॥)
చేపట్టి నీతో నేను సెలవి నవ్విన నవ్వు
ఆపెకేల కన్నుగీఁటే వంతలోనే
తీపులుగా నాకప్పటి తిరుగ సన్న సేసేవు
నీపొందులు జరపఁగ నీకే భారము

(॥ఇద్ద॥)
కూరిమితో నే నిన్నుఁ గూడినకూటము లివి
ఆరయ యందేలసేసే వంతలోనే
యీరీతి నాపెను నన్ను ఇట్టె సమ్మతి సేసితి
నేరుపు శ్రీ వేంకటేశ నీకే భారము

(||pallavi||)
iddaramu niddaramĕ yĕṭṭu vĕnaga tiyyamu
tiddevānim̐ jūdamu devaravu nīvu

(||idda||)
makkuva nīdo nenu māḍalāḍinaṭṭi māḍa
akkaḍa nela sĕppidi vaṁtalone
pakkana nappaḍi nābĕbaṁtamu nādom̐jĕppevu
nikki yībanulu dīrsa nīge bhāramu

(||idda||)
sebaṭṭi nīdo nenu sĕlavi navvina navvu
ābĕgela kannugīm̐ṭe vaṁtalone
tībulugā nāgappaḍi tiruga sanna sesevu
nībŏṁdulu jarabam̐ga nīge bhāramu

(||idda||)
kūrimido ne ninnum̐ gūḍinagūḍamu livi
āraya yaṁdelasese vaṁtalone
yīrīdi nābĕnu nannu iṭṭĕ sammadi sesidi
nerubu śhrī veṁkaḍeśha nīge bhāramu