Iddaramu niddarame yemdu voyyeme

ఇద్దరము నిద్దరమే యెందు వొయ్యేమే
Language

(॥పల్లవి॥)
ఇద్దరము నిద్దరమే యెందు వొయ్యేమే
కద్దులేవే వేడుకకుఁ గడమేమీ లేదు

(॥ఇద్ద॥)
చవులై నవలపులు సరుసనే వుండఁగాను
ఇవల నెడమాటలు యింకానేలే
తవిలి నేనే వచ్చే తానీడకు విచ్చేసీ
వివరముతో నంతేసి వేగిరములేలే

(॥ఇద్ద॥)
కాతరపుతమకము కైవశమై వుండఁగాన
చేతుల సన్నలు గొంత సేయఁగనేలే
యీతలఁ దా చెక్కునొక్కీ యిందుకు నేనైనా మొక్కే
యేతులుఁ యెమ్మెలు నిఁక యెంచనున్నదా

(॥ఇద్ద॥)
కదిసినదేహములు కాఁగిటనే వుండఁగాను
గుదిగొని మది వేరే కొసరనేలే
యిదివో శ్రీ వేంకటేశుఁ డిన్నిటాను నన్నుఁ గూడె
వెదకి చూచితె మరి వేరులేదు ఇఁకను

(||pallavi||)
iddaramu niddarame yĕṁdu vŏyyeme
kadduleve veḍugagum̐ gaḍamemī ledu

(||idda||)
savulai navalabulu sarusane vuṁḍam̐gānu
ivala nĕḍamāḍalu yiṁkānele
tavili nene vachche tānīḍagu vichchesī
vivaramudo naṁtesi vegiramulele

(||idda||)
kādarabudamagamu kaivaśhamai vuṁḍam̐gāna
sedula sannalu gŏṁta seyam̐ganele
yīdalam̐ dā sĕkkunŏkkī yiṁdugu nenainā mŏkke
yedulum̐ yĕmmĕlu nim̐ka yĕṁchanunnadā

(||idda||)
kadisinadehamulu kām̐giḍane vuṁḍam̐gānu
gudigŏni madi vere kŏsaranele
yidivo śhrī veṁkaḍeśhum̐ ḍinniḍānu nannum̐ gūḍĕ
vĕdagi sūsidĕ mari veruledu im̐kanu