Iddaramu niddarame vovoyi

ఇద్దరము నిద్దరమే వోవోయి
Language

(॥పల్లవి॥)
ఇద్దరము నిద్దరమే వోవోయి
వద్దుసుమ్మీ వట్టిపంతా లోవోయి

(॥ఇద్ద॥)
యెఱఁగవా మాగుట్టు యేమోయి మమ్ము
ఉఱక గుట్టరసేవు వోవోయి
యెఱికెతనా నీకు యేమోయి - మాపై
వొఱగుంటే నేమాయనో వోవోయి

(॥ఇద్ద॥)
యెప్పటికెప్పటి సుద్దులేమోయి - నీపై
నుప్పరాలెగసీఁ జన్నులేమోయి
యిప్పలేర్లులాయ మోవి యేమోయి
వొప్పన గొనుమీ నేఁడు వోవోయి

(॥ఇద్ద॥)
యెమ్మెలు మనలోనేల యేమోయి
వుమ్మగిలీ వలపులు వోవోయి
యిమ్ముల శ్రీవేంకటేశ యింతలోనె కూడితిమి
వొమ్మె గా జాణతనాలోవోయి

(||pallavi||)
iddaramu niddarame vovoyi
vaddusummī vaṭṭibaṁtā lovoyi

(||idda||)
yĕṟam̐gavā māguṭṭu yemoyi mammu
uṟaga guṭṭarasevu vovoyi
yĕṟigĕdanā nīgu yemoyi - mābai
vŏṟaguṁṭe nemāyano vovoyi

(||idda||)
yĕppaḍigĕppaḍi suddulemoyi - nībai
nupparālĕgasīm̐ jannulemoyi
yippalerlulāya movi yemoyi
vŏppana gŏnumī nem̐ḍu vovoyi

(||idda||)
yĕmmĕlu manalonela yemoyi
vummagilī valabulu vovoyi
yimmula śhrīveṁkaḍeśha yiṁtalonĕ kūḍidimi
vŏmmĕ gā jāṇadanālovoyi