Iddaramu niddarame hrsheegesha

ఇద్దరము నిద్దరమె హృషీకేశ
Language

(॥పల్లవి॥)
ఇద్దరము నిద్దరమె హృషీకేశ
యిద్దె సనకాన వచ్చె హృషీకేశా

(॥ఇద్ద॥)
ఏఁటికోయి మాతో హృషీ కేశ
యీటువెట్టేవు సతుల హృషీ కేశ
యీటారదు మాపొందు హృషీ కేశ నీపై
యేటి దియ్యమింక నేము హృషీ కేశ

(॥ఇద్ద॥)
ఇచ్చకురాలను నేను హృషీకేశ నిన్ను
నెచ్చుకుందులాడఁ జాల హృషీకేశ
ఇచ్చితి వింత చనవు హృషీకేశ నీకు
నెచ్చరించే మరవకు హృషీకేశ

(॥ఇద్ద॥)
యేల నీకు మఱుఁగులు హృషీకేశ నన్ను
నీలాగునఁ గూడితివి హృషీకేశ
యేలితి శ్రీవేంకటాద్రి హృషీకేశ
యీలీలనే వుండుమీ హృషీకేశ

(||pallavi||)
iddaramu niddaramĕ hṛṣhīgeśha
yiddĕ sanagāna vachchĕ hṛṣhīgeśhā

(||idda||)
em̐ṭigoyi mādo hṛṣhī keśha
yīḍuvĕṭṭevu sadula hṛṣhī keśha
yīḍāradu mābŏṁdu hṛṣhī keśha nībai
yeḍi diyyamiṁka nemu hṛṣhī keśha

(||idda||)
ichchagurālanu nenu hṛṣhīgeśha ninnu
nĕchchuguṁdulāḍam̐ jāla hṛṣhīgeśha
ichchidi viṁta sanavu hṛṣhīgeśha nīgu
nĕchchariṁche maravagu hṛṣhīgeśha

(||idda||)
yela nīgu maṟum̐gulu hṛṣhīgeśha nannu
nīlāgunam̐ gūḍidivi hṛṣhīgeśha
yelidi śhrīveṁkaḍādri hṛṣhīgeśha
yīlīlane vuṁḍumī hṛṣhīgeśha