Iddaramu meeyeduda nidivo vunnaaramu

ఇద్దరము మీయెదుట నిదివో వున్నారము
Language

(॥పల్లవి॥)
ఇద్దరము మీయెదుట నిదివో వున్నారము
వొద్దికతోఁ దేర్చరే వొక్కటయ్యేము

(॥ఇద్ద॥)
మొగము తాఁ జూచితేనే నగితి నే నంతలోనే
తగవులు చెప్పరే తరుణులాల
పగటులవాఁడు తాను పంతగత్తెను నేను
జగమెల్లనెఱుఁగు మాసహజములు

(॥ఇద్ద॥)
పైకొని వొడివట్టితే పక్కన గోరనొత్తితి
సాకిరులు చెప్పరే సతులాల
కాకరిమాట తనది కందువ జంకెన నాది
చేకొన్న మావొళ్లఁ గలసేఁతలివి

(॥ఇద్ద॥)
గట్టిగాఁ జెక్కునొక్కితేఁ గాఁగిటఁ గూడితి నేను
చుట్టిరికాలు చెప్పరే సుదతులాల
యిట్టే తా శ్రీవేంకటేశుఁ డిందిరాదేవిని నేను
గుట్టున మాయందుఁగల గుణములివి

(||pallavi||)
iddaramu mīyĕduḍa nidivo vunnāramu
vŏddigadom̐ dersare vŏkkaḍayyemu

(||idda||)
mŏgamu tām̐ jūsidene nagidi ne naṁtalone
tagavulu sĕppare taruṇulāla
pagaḍulavām̐ḍu tānu paṁtagattĕnu nenu
jagamĕllanĕṟum̐gu māsahajamulu

(||idda||)
paigŏni vŏḍivaṭṭide pakkana goranŏttidi
sāgirulu sĕppare sadulāla
kāgarimāḍa tanadi kaṁduva jaṁkĕna nādi
segŏnna māvŏḽlam̐ galasem̐talivi

(||idda||)
gaṭṭigām̐ jĕkkunŏkkidem̐ gām̐giḍam̐ gūḍidi nenu
suṭṭirigālu sĕppare sudadulāla
yiṭṭe tā śhrīveṁkaḍeśhum̐ ḍiṁdirādevini nenu
guṭṭuna māyaṁdum̐gala guṇamulivi