ఇద్దరము మనలోన నెగ్గు లేడవి
(॥పల్లవి॥)
ఇద్దరము మనలోన నెగ్గు లేడవి
గద్దించకుమీ నిన్ను ఘాతలు సేసితిని
(॥ఇద్ద॥)
వాసులకే పెనఁగేము వలచి వలచి నీకు
వేసరుకోకు మెంతైనా విడువరాదు
నీసరిఁ గూచుండుదుము నీవిట్టె మన్నించఁగానే
దోసము లేదనుమీ నేఁ దొక్కితి నీపాదము
(॥ఇద్ద॥)
చనవులే నెరపేము సారెకును సారెకును
మనసు దియ్యకు పొందు మానఁగరాదు
మనవులు చెప్పుదుము మాకుఁ బంపు సేయఁగాను
యెనసి కడుగుకో మోవెంగిలి సేసితిని
(॥ఇద్ద॥)
యెమ్మెలే పచరించేము యెరిఁగి యెరిఁగి నీతో
కుమ్మరించకుమీ సిగ్గు కొదువలేదు
దిమ్ముల శ్రీ వేంకటేశ తేరి నన్నుఁ గూడితివి
సమ్మతి నోరుచుకొమ్మీ చన్నుల నొత్తితిని
(||pallavi||)
iddaramu manalona nĕggu leḍavi
gaddiṁchagumī ninnu ghādalu sesidini
(||idda||)
vāsulage pĕnam̐gemu valasi valasi nīgu
vesarugogu mĕṁtainā viḍuvarādu
nīsarim̐ gūsuṁḍudumu nīviṭṭĕ manniṁcham̐gāne
dosamu ledanumī nem̐ dŏkkidi nībādamu
(||idda||)
sanavule nĕrabemu sārĕgunu sārĕgunu
manasu diyyagu pŏṁdu mānam̐garādu
manavulu sĕppudumu māgum̐ baṁpu seyam̐gānu
yĕnasi kaḍugugo movĕṁgili sesidini
(||idda||)
yĕmmĕle pasariṁchemu yĕrim̐gi yĕrim̐gi nīdo
kummariṁchagumī siggu kŏduvaledu
dimmula śhrī veṁkaḍeśha teri nannum̐ gūḍidivi
sammadi norusugŏmmī sannula nŏttidini