Iddara negamulaide nemaayane

ఇద్దర నేకములైతే నేమాయనే
Language

(॥పల్లవి॥)
ఇద్దర నేకములైతే నేమాయనే
చద్దివేఁడి వలపులు జాగుసేయఁ జెల్లునా

(॥॥)
తుమ్మిదవంటివాఁడు తొలుతనే మగవాఁడు
యెమ్మెలకు నేడనున్నా నేమాయనే
తమ్మి పువ్వువంటి దింతే తగిలినయాఁటదెల్లా
సమ్మతించవలెఁగాక సడిఁబెట్టఁజెల్లునా

(॥॥)
వెన్నెలవంటి దింతే వెస మగవానినవ్వు
యెన్నిచోట్లఁ గాసిన నేమాయనే
యెన్నఁ జకోరాలవంటి వింతులకనుఁగొనలు
అన్నిటాఁ బొందౌటగాక అలుఁగఁగఁజెల్లునా

(॥॥)
సిరులగాలివంటిది శ్రీవేంకటేశుమనసు
ఇరవై యెందువారినా నేమాయనే
విరులతావివంటివెలఁదివి నిన్నుఁగూడె
నరసుఁడాతని నింక జరయంగఁ జెల్లునా

(||pallavi||)
iddara negamulaide nemāyane
saddivem̐ḍi valabulu jāguseyam̐ jĕllunā

(||||)
tummidavaṁṭivām̐ḍu tŏludane magavām̐ḍu
yĕmmĕlagu neḍanunnā nemāyane
tammi puvvuvaṁṭi diṁte tagilinayām̐ṭadĕllā
sammadiṁchavalĕm̐gāga saḍim̐bĕṭṭam̐jĕllunā

(||||)
vĕnnĕlavaṁṭi diṁte vĕsa magavāninavvu
yĕnnisoṭlam̐ gāsina nemāyane
yĕnnam̐ jagorālavaṁṭi viṁtulaganum̐gŏnalu
anniḍām̐ bŏṁdauḍagāga alum̐gam̐gam̐jĕllunā

(||||)
sirulagālivaṁṭidi śhrīveṁkaḍeśhumanasu
iravai yĕṁduvārinā nemāyane
viruladāvivaṁṭivĕlam̐divi ninnum̐gūḍĕ
narasum̐ḍādani niṁka jarayaṁgam̐ jĕllunā