ఇద్దర మాడువారమె యిస్సీ రోఁత
(॥పల్లవి॥)
ఇద్దర మాడువారమె యిస్సీ రోఁత
వొద్దిక మాలో నేమే వొత్తి నవ్వితిమిరా
(॥ఇద్దర॥)
పవ్వళించి నీవు నేనుఁ బానుపుపై నుండఁగాను
యెవ్వతో నీవంటా నన్ను నిటు లేపరా
రవ్వగా నీవే నన్ను రతికిఁ బిలిచేవంటా
నెవ్వగఁ గౌఁగిలించితి నిదురకన్నులను
(॥ఇద్దర॥)
కదిసి నీవును నేను కౌఁగిలించుకుండఁగానె
సుదతి నీ వంటా నన్ను చో టడిగెరా
మదనపరవశాన మఱి నీ వంటా నాపె
వదనమున వీడెము వడి నే నిడితిరా
(॥ఇద్దర॥)
ముచ్చట నీవును నేను ముఁసుగు వెట్టుకుండఁగా
మచ్చికె నీవంటా నాతో మాట చెప్పెరా
యిచ్చకుఁడ శ్రీవేంకటేశుఁడ నీవంటా నాపె
నచ్చి నన్నుఁ గూడఁగా నడుమ నీ వుంటివి
(||pallavi||)
iddara māḍuvāramĕ yissī rom̐ta
vŏddiga mālo neme vŏtti navvidimirā
(||iddara||)
pavvaḽiṁchi nīvu nenum̐ bānububai nuṁḍam̐gānu
yĕvvado nīvaṁṭā nannu niḍu lebarā
ravvagā nīve nannu radigim̐ bilisevaṁṭā
nĕvvagam̐ gaum̐giliṁchidi niduragannulanu
(||iddara||)
kadisi nīvunu nenu kaum̐giliṁchuguṁḍam̐gānĕ
sudadi nī vaṁṭā nannu so ṭaḍigĕrā
madanabaravaśhāna maṟi nī vaṁṭā nābĕ
vadanamuna vīḍĕmu vaḍi ne niḍidirā
(||iddara||)
muchchaḍa nīvunu nenu mum̐sugu vĕṭṭuguṁḍam̐gā
machchigĕ nīvaṁṭā nādo māḍa sĕppĕrā
yichchagum̐ḍa śhrīveṁkaḍeśhum̐ḍa nīvaṁṭā nābĕ
nachchi nannum̐ gūḍam̐gā naḍuma nī vuṁṭivi