ఇతవుగా మతి కోప మింతయుఁ దీరిన మీఁద
(॥పల్లవి॥)
ఇతవుగా మతి కోప మింతయుఁ దీరిన మీఁద
కతకు గాళ్లు చెప్పీఁ గడమ లేదయ్యా
(॥ఇత॥)
నెలఁతలతో నిన్ను నిష్టూరాలాడుకొంటా
సొలయుచు నీకెదురు చూచుకొంటాను
అలసేటి వేళనే అండకు విచ్చేసితివి
కులికి యా నోరనే కొనియాడేమయ్యా
(॥ఇత॥)
వూరకే నిన్ను సాదించే వుపమ దలఁచుకొంటా
సారె నీకుఁ గమ్మ వా(వ్రా)సి చదువుకొంటా
యీరీతి నే నుండఁగా నన్నింతలో మన్నించితివి
కూరిముల ఆనోరనే కొనియాడేమయ్యా
(॥ఇత॥)
సరవి నీ బాసలు సాకిరులు వెట్టుకొంటా
ధర నీ చక్కఁ దనాలు తలఁచుకొంటా
వొరయఁగా శ్రీ వేంకటోత్తమ నన్నుఁ గూడితి
సరుగ యీ నోరనే సన్నుతించేమయ్యా
(||pallavi||)
idavugā madi koba miṁtayum̐ dīrina mīm̐da
kadagu gāḽlu sĕppīm̐ gaḍama ledayyā
(||ida||)
nĕlam̐talado ninnu niṣhṭūrālāḍugŏṁṭā
sŏlayusu nīgĕduru sūsugŏṁṭānu
alaseḍi veḽane aṁḍagu vichchesidivi
kuligi yā norane kŏniyāḍemayyā
(||ida||)
vūrage ninnu sādiṁche vubama dalam̐sugŏṁṭā
sārĕ nīgum̐ gamma vā(vrā)si saduvugŏṁṭā
yīrīdi ne nuṁḍam̐gā nanniṁtalo manniṁchidivi
kūrimula ānorane kŏniyāḍemayyā
(||ida||)
saravi nī bāsalu sāgirulu vĕṭṭugŏṁṭā
dhara nī sakkam̐ danālu talam̐sugŏṁṭā
vŏrayam̐gā śhrī veṁkaḍottama nannum̐ gūḍidi
saruga yī norane sannudiṁchemayyā