Idavu sesinavaari kidi vaadaa yammalaala

ఇతవు సేసినవారి కిది వాటా యమ్మలాల
Language

(॥పల్లవి॥)
ఇతవు సేసినవారి కిది వాటా యమ్మలాల
కతలు చెప్పఁగఁ బోతే కాఁక రేఁగీ నితఁడు

(॥ఇతవు॥)
కడు దప్పిదేరఁగాను కప్పుర మియ్యఁగఁ బోతే
వుడికి తిట్టఁగవచ్చీ నో యమ్మవీఁడు
వడియుఁ జెమట తుడువఁగఁబోతే పయ్యదను
తడిపాఁత మెడ గొంత తలమనీ నితఁడు

(॥ఇతవు॥)
కురులు చెదరినవి కూడఁ జెరుగఁగఁ బోతే
విరసాల విదలించివేసీనే వీఁడు
సరుగఁ గస్తూరిబొట్టు చక్కతిద్దఁ బోతేను
వురిసీ నందుకుఁ దో డుప్పని నితఁడు

(॥ఇతవు॥)
సిగ్గుతో విజనగరసింగారవనములోన
వెగ్గళించి కొనేటి శ్రీవేంకటేశుఁడు
నిగ్గుల నన్నుఁ గూడఁగా నిజాన మెచ్చఁగఁ బోతే
వొగ్గి మాటలబెల్లాల కొడిగట్టీ నితఁడు

(||pallavi||)
idavu sesinavāri kidi vāḍā yammalāla
kadalu sĕppam̐gam̐ bode kām̐ka rem̐gī nidam̐ḍu

(||idavu||)
kaḍu dappideram̐gānu kappura miyyam̐gam̐ bode
vuḍigi tiṭṭam̐gavachchī no yammavīm̐ḍu
vaḍiyum̐ jĕmaḍa tuḍuvam̐gam̐bode payyadanu
taḍibām̐ta mĕḍa gŏṁta talamanī nidam̐ḍu

(||idavu||)
kurulu sĕdarinavi kūḍam̐ jĕrugam̐gam̐ bode
virasāla vidaliṁchivesīne vīm̐ḍu
sarugam̐ gastūribŏṭṭu sakkadiddam̐ bodenu
vurisī naṁdugum̐ do ḍuppani nidam̐ḍu

(||idavu||)
siggudo vijanagarasiṁgāravanamulona
vĕggaḽiṁchi kŏneḍi śhrīveṁkaḍeśhum̐ḍu
niggula nannum̐ gūḍam̐gā nijāna mĕchcham̐gam̐ bode
vŏggi māḍalabĕllāla kŏḍigaṭṭī nidam̐ḍu