Idaveramgavaddaa yissee neevu

ఇతవెరఁగవద్దా యిస్సీ నీవు
Language

(॥పల్లవి॥)
ఇతవెరఁగవద్దా యిస్సీ నీవు
అతిజాణ విన్నిటాను అది నీవెరఁగవా

(॥ఇత॥)
చిమ్మేటి చూపులతోడ చెంగావి మోవితోడ
కొమ్మనీతో మాటలాడి కొసరీనదే
కుమ్మరింపువలపుతో గుబ్బల మెరుఁగు చూపి
అమ్మె నీకు దేహమెల్లానది చాలదా

(॥ఇత॥)
సారెఁబన్నసరాలతో చల్లేటి నిట్టూర్పుతోడ
వూరకే నీమాటలెల్లా నూఁకొనీనదే
భారపుతురుముతోడ పయ్యదజారుతోడ
ఆరని చెమటలూఁది నదె చాలదా

(॥ఇత॥)
నాముఁ బులకలతోడ నాటిన చిత్తముతోడ
వేమారు నీ మీఁద మేను వేసీనిదె
బూమెల శ్రీవేంకటేశ పొలఁతిఁగూడితివిట్టె
ఆమగువ నిన్ను మెచ్చెనది చాలదా

(||pallavi||)
idavĕram̐gavaddā yissī nīvu
adijāṇa vinniḍānu adi nīvĕram̐gavā

(||ida||)
simmeḍi sūbuladoḍa sĕṁgāvi movidoḍa
kŏmmanīdo māḍalāḍi kŏsarīnade
kummariṁpuvalabudo gubbala mĕrum̐gu sūbi
ammĕ nīgu dehamĕllānadi sāladā

(||ida||)
sārĕm̐bannasarālado salleḍi niṭṭūrbudoḍa
vūrage nīmāḍalĕllā nūm̐kŏnīnade
bhārabudurumudoḍa payyadajārudoḍa
ārani sĕmaḍalūm̐di nadĕ sāladā

(||ida||)
nāmum̐ bulagaladoḍa nāḍina sittamudoḍa
vemāru nī mīm̐da menu vesīnidĕ
būmĕla śhrīveṁkaḍeśha pŏlam̐tim̐gūḍidiviṭṭĕ
āmaguva ninnu mĕchchĕnadi sāladā