Idave nerabavale yeereedi neevale

ఇతవే నెరపవలె యీరీతి నీవలె
Language

(॥పల్లవి॥)
ఇతవే నెరపవలె యీరీతి నీవలె
మితిలేని నీ గుణాలు మెచ్చితినే చెలియా

(॥ఇత॥)
నెపములు వేయరాదు నేరుపరిపతిమీఁద
వుపమించి యాడరాదు వొడ్డుకోరాదు
కపురులు చూపరాదు కాఁక వచరించరాదు
యెపుడూ సాదించరాదు ఇల్లాలికి

(॥ఇత॥)
మనసు నొప్పించరాదు మరి మారుకోరాదు
గునియరా దలయించి కొసరరాదు
చనవున మీరరాదు సవతులఁ దిట్టరాదు
తనుఁ బొగడుకోరా దుత్తమురాలికి

(॥ఇత॥)
తగ వడుగఁగరాదు తారుకాణఁ బెట్టరాదు
పగటు మెరయరాదు పదరరాదు
తగు నలమేల్మంగ వాతఁడు శ్రీవేంకటేశుడు
మగఁడాయ నీవంటి మంచి ప్రియరాలికి

(||pallavi||)
idave nĕrabavalĕ yīrīdi nīvalĕ
midileni nī guṇālu mĕchchidine sĕliyā

(||ida||)
nĕbamulu veyarādu nerubaribadimīm̐da
vubamiṁchi yāḍarādu vŏḍḍugorādu
kaburulu sūbarādu kām̐ka vasariṁcharādu
yĕbuḍū sādiṁcharādu illāligi

(||ida||)
manasu nŏppiṁcharādu mari mārugorādu
guniyarā dalayiṁchi kŏsararādu
sanavuna mīrarādu savadulam̐ diṭṭarādu
tanum̐ bŏgaḍugorā duttamurāligi

(||ida||)
taga vaḍugam̐garādu tārugāṇam̐ bĕṭṭarādu
pagaḍu mĕrayarādu padararādu
tagu nalamelmaṁga vādam̐ḍu śhrīveṁkaḍeśhuḍu
magam̐ḍāya nīvaṁṭi maṁchi priyarāligi