ఇతవరిఁ గనక నీ కెరుఁగించితి
(॥పల్లవి॥)
ఇతవరిఁ గనక నీ కెరుఁగించితి
కతలేర్పడకుండితే కాంతలు నవ్వేరు
(॥॥)
చెలితో నేకతమాడి చెప్పుతానుండె నీతి
కలవెల్లా నీసుద్దులే కాఁబోలును
అలివేణితో నీవు ఆడుకొని రావయ్య
తెలుపుకొనకుండితే తెరవలు నవ్వేరు
(॥॥)
సుదతికి నిన్ను వేలఁ జూపుతానుండె నీతి
అదన నీప్రసంగమే అది గాఁబోలు
పదిలాన నీనేరాలు పాపుకొని రావయ్య
ముదులకించ కుండితే ముదితలు నవ్వేరు
(॥॥)
నడుమ శ్రీ వేంకటేశ నవ్వుతానుండు నీసతి
కడుఁగడు నిన్నుఁ జూచేకాఁబోలును
అడరి నన్నేలితివి అమాఁటడిగి రావయ్య
తడవ కూరకుండితే తరుణులు నవ్వేరు
(||pallavi||)
idavarim̐ ganaga nī kĕrum̐giṁchidi
kadalerbaḍaguṁḍide kāṁtalu navveru
(||||)
sĕlido negadamāḍi sĕppudānuṁḍĕ nīdi
kalavĕllā nīsuddule kām̐bolunu
aliveṇido nīvu āḍugŏni rāvayya
tĕlubugŏnaguṁḍide tĕravalu navveru
(||||)
sudadigi ninnu velam̐ jūbudānuṁḍĕ nīdi
adana nīprasaṁgame adi gām̐bolu
padilāna nīnerālu pābugŏni rāvayya
mudulagiṁcha kuṁḍide mudidalu navveru
(||||)
naḍuma śhrī veṁkaḍeśha navvudānuṁḍu nīsadi
kaḍum̐gaḍu ninnum̐ jūsegām̐bolunu
aḍari nannelidivi amām̐ṭaḍigi rāvayya
taḍava kūraguṁḍide taruṇulu navveru