Idavainappude padi yeedagu vachcheemgaani

ఇతవైనప్పుడే పతి యీడకు వచ్చీఁగాని
Language

(॥పల్లవి॥)
ఇతవైనప్పుడే పతి యీడకు వచ్చీఁగాని
చతురుని నిందుకుఁ గా జంకించ నోపనే

(॥ఇత॥)
చనపుగల్గుమాట చక్కనై యిన్నిటాఁ జెలులు
మనసెసనిన పొందు మఱపుఁ గాదు
ననుపులేనిచోట నగవులకైనాను
పెనఁగితేఁ జలమెక్కు పిలువ నేనోపనే

(॥ఇత॥)
ముసిపి దీరనిచోట మోనమైనా నింపులే
సుసరమయిన చోటి సుద్దులే చని
కసిగాటు మోహముతో కలగంప వలపులు
పిసికితేఁ బుసురౌను పిలువ నే నోపనే

(॥ఇత॥)
చేరి సరసపు వేళఁ జేసినదెల్లాఁ జేఁత
యీరీతి శ్రీవేంకటేశుఁ డిటు గూడెను
వూరకే యిట్లఁ గాక వొకరీతి నైతేను
పేరుకొని సారెసారెఁ బిలువ నేనోవనే

(||pallavi||)
idavainappuḍe padi yīḍagu vachchīm̐gāni
saduruni niṁdugum̐ gā jaṁkiṁcha nobane

(||ida||)
sanabugalgumāḍa sakkanai yinniḍām̐ jĕlulu
manasĕsanina pŏṁdu maṟabum̐ gādu
nanubulenisoḍa nagavulagainānu
pĕnam̐gidem̐ jalamĕkku piluva nenobane

(||ida||)
musibi dīranisoḍa monamainā niṁpule
susaramayina soḍi suddule sani
kasigāḍu mohamudo kalagaṁpa valabulu
pisigidem̐ busuraunu piluva ne nobane

(||ida||)
seri sarasabu veḽam̐ jesinadĕllām̐ jem̐ta
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍiḍu gūḍĕnu
vūrage yiṭlam̐ gāga vŏgarīdi naidenu
perugŏni sārĕsārĕm̐ biluva nenovane