Idarula taramaa yimtesi

ఇతరుల తరమా యింతేసి
Language

(॥పల్లవి॥)
ఇతరుల తరమా యింతేసి-
అతిరాజసమున నీ వాడితిగాక

(॥ఇత॥)
కల్లయు నిజమునుఁ గానక పతితో
నుల్లస మాడఁగ నుచితములా
బల్లిదురాలవు పట్టపుదేవివి
చెల్లుఁగనక అటుసేసితి నీవు

(॥ఇత॥)
వెనకముందు భావించక నీపతి
పెనగొని యిటు గోపించితివి
వెనుకొని యీతనివిరహము నీపైఁ
జనవునుఁ గులుఁగఁగ జందములాయ

(॥ఇత॥)
అకట నతమక మాఁపఁగ లేకే
మొకమోడక చెయి ముంచితివి
వెకలియైన శ్రీవేంకటేశ్వరుఁ
డొకటని కూడఁగ నొద్దికలాయ

(||pallavi||)
idarula taramā yiṁtesi-
adirājasamuna nī vāḍidigāga

(||ida||)
kallayu nijamunum̐ gānaga padido
nullasa māḍam̐ga nusidamulā
ballidurālavu paṭṭabudevivi
sĕllum̐ganaga aḍusesidi nīvu

(||ida||)
vĕnagamuṁdu bhāviṁchaga nībadi
pĕnagŏni yiḍu gobiṁchidivi
vĕnugŏni yīdanivirahamu nībaim̐
janavunum̐ gulum̐gam̐ga jaṁdamulāya

(||ida||)
agaḍa nadamaga mām̐pam̐ga lege
mŏgamoḍaga sĕyi muṁchidivi
vĕgaliyaina śhrīveṁkaḍeśhvarum̐
ḍŏgaḍani kūḍam̐ga nŏddigalāya