Idarula seda naunaa yeebanulu

ఇతరుల చేత నౌనా యీపనులు
Language

(॥పల్లవి॥)
ఇతరుల చేత నౌనా యీపనులు
తతి నన్నిటికి గురి తానే కదవే

(॥ఇత॥)
బిగిసి యాపెయు నేను బీరము లాడేటివేళ
తగవుఁ జెప్పఁగలఁడు తా రమ్మనవే
అగడుగా నిద్దరము అవుఁగాదనుకొనేవేళ
వెగటు దీరుచు నిందు విచ్చేయుమనవే

(॥ఇత॥)
బలిమి నొక్కొక్కరము పంతములాడేటి వేళ
సొలపు దీర్చ నేరుచుఁ జూడుమనవే
యెలమి మాలో నేము ఇంత రేసయిన వేళ
వలసినట్లు సేసును వద్దనుండు మనవే

(॥ఇత॥)
దగ్గరి సవతులము తమకించేయట్టివేళ
సిగ్గు వాపి మమ్ముఁ గూడఁ జెల్లుననవే,
నిగ్గుల శ్రీ వేంకటాద్రినిలయుఁడు తాఁగలసె
వొగ్గితిమి మా చేఁతల కొడ్డుకోకుమనవే

(||pallavi||)
idarula seda naunā yībanulu
tadi nanniḍigi guri tāne kadave

(||ida||)
bigisi yābĕyu nenu bīramu lāḍeḍiveḽa
tagavum̐ jĕppam̐galam̐ḍu tā rammanave
agaḍugā niddaramu avum̐gādanugŏneveḽa
vĕgaḍu dīrusu niṁdu vichcheyumanave

(||ida||)
balimi nŏkkŏkkaramu paṁtamulāḍeḍi veḽa
sŏlabu dīrsa nerusum̐ jūḍumanave
yĕlami mālo nemu iṁta resayina veḽa
valasinaṭlu sesunu vaddanuṁḍu manave

(||ida||)
daggari savadulamu tamagiṁcheyaṭṭiveḽa
siggu vābi mammum̐ gūḍam̐ jĕllunanave,
niggula śhrī veṁkaḍādrinilayum̐ḍu tām̐galasĕ
vŏggidimi mā sem̐tala kŏḍḍugogumanave