Idaramu lemiyunu nemchavaladu

ఇతరము లేమియును నెంచవలదు
Language

(॥పల్లవి॥)
ఇతరము లేమియును నెంచవలదు
తతిఁ దానే మేలువాఁడై తలకొనవలయు

(॥ఇతర॥)
అన్ని పదార్థము లమ్ము నంగళ్లలోపల
తిన్నఁగా మంచివే కొని తెచ్చుకొన్నట్టు
పన్ని నానా ధర్మములు ప్రాణుల కెల్లాఁ గలవు
అన్నిటా మంచితనాన కానందించవలయు

(॥ఇతర॥)
తెరువు లెన్ని గలవు దేశములమీఁదికి
హరిఁ బుణ్యతీర్థముల కరగినట్టు
వొరసితే విప్రులందు నుండు బహుగుణములు
నిరుల మంచితనాలే చేపట్టగవలయు

(॥ఇతర॥)
పెక్కు మతములు చెప్పు బెరసి వేదములందు
దక్క శ్రీవేంకటేశుమతము గన్నట్టు
వక్కణింప ఘను లెటువలెనైనా నడతురు
చక్కని మంచితనమే సంతోషించవలయు

(||pallavi||)
idaramu lemiyunu nĕṁchavaladu
tadim̐ dāne meluvām̐ḍai talagŏnavalayu

(||idara||)
anni padārdhamu lammu naṁgaḽlalobala
tinnam̐gā maṁchive kŏni tĕchchugŏnnaṭṭu
panni nānā dharmamulu prāṇula kĕllām̐ galavu
anniḍā maṁchidanāna kānaṁdiṁchavalayu

(||idara||)
tĕruvu lĕnni galavu deśhamulamīm̐digi
harim̐ buṇyadīrdhamula karaginaṭṭu
vŏraside viprulaṁdu nuṁḍu bahuguṇamulu
nirula maṁchidanāle sebaṭṭagavalayu

(||idara||)
pĕkku madamulu sĕppu bĕrasi vedamulaṁdu
dakka śhrīveṁkaḍeśhumadamu gannaṭṭu
vakkaṇiṁpa ghanu lĕḍuvalĕnainā naḍaduru
sakkani maṁchidaname saṁtoṣhiṁchavalayu