Idara kaamtalu soosi yemani navvuduro

ఇతర కాంతలు చూచి యేమని నవ్వుదురో
Language

(॥పల్లవి॥)
ఇతర కాంతలు చూచి యేమని నవ్వుదురో
రతివేళ చేఁతలు మరఁగుచేయఁ గదవే

(॥ఇత॥)
సమరతి యాతనితో సలుపఁగాఁ బొడమిన-
చెమటార విసరవే చెలువునికి
తమల మప్పుడు నీకు తమితోడఁ బెట్టెనేమో
అమర వేరొక్కవిడెమంది చేతికియ్యవే

(॥ఇత॥)
కప్పుకొన్నవచ్చడము కడునెరి విరిగెను
యెప్పటివలెనే విచ్చి యియ్యఁగదవే
లప్పలై గందము రాలీ లావునఁ బెనఁగెనేమో
చొప్పెఱఁగకుండాఁ గస్తూరి మీఁదఁ బూయవే

(॥ఇత॥)
సరసమాడఁగనేమో తురుము వీడివున్నది
విరులు ముడువవే వేవేగను
అరిది శ్రీవేంకటేశుఁ డలమేల్‌మంగవిభుఁడు
నెరులచిక్కు దిద్దవే నెట్టన నన్నేలెను

(||pallavi||)
idara kāṁtalu sūsi yemani navvuduro
radiveḽa sem̐talu maram̐guseyam̐ gadave

(||ida||)
samaradi yādanido salubam̐gām̐ bŏḍamina-
sĕmaḍāra visarave sĕluvunigi
tamala mappuḍu nīgu tamidoḍam̐ bĕṭṭĕnemo
amara verŏkkaviḍĕmaṁdi sedigiyyave

(||ida||)
kappugŏnnavachchaḍamu kaḍunĕri virigĕnu
yĕppaḍivalĕne vichchi yiyyam̐gadave
lappalai gaṁdamu rālī lāvunam̐ bĕnam̐gĕnemo
sŏppĕṟam̐gaguṁḍām̐ gastūri mīm̐dam̐ būyave

(||ida||)
sarasamāḍam̐ganemo turumu vīḍivunnadi
virulu muḍuvave veveganu
aridi śhrīveṁkaḍeśhum̐ ḍalamel‌maṁgavibhum̐ḍu
nĕrulasikku diddave nĕṭṭana nannelĕnu