Idanisamdamu harihari yemi seppam golamdi harihari

ఇతనిచందము హరిహరి యేమి చెప్పఁ గొలఁది హరిహరి
Language

(॥పల్లవి॥)
ఇతనిచందము హరిహరి యేమి చెప్పఁ గొలఁది హరిహరి
అతిరహస్యముల హరిహరి అదిగో మనకుఁ జిక్కె హరిహరి

(॥ఇత॥)
ఆదివిష్ణుఁ డితఁడు హరిహరి అదె యశోదకొడుకు హరిహరి
వేదమూర్తి ఇతఁడె హరిహరి వెన్నదొంగిలించె హరిహరి
సాదుబండి విఱిచె హరిహరి చంటివిషము చెరిచె హరిహరి

(॥ఇత॥)
పరమపరుషుఁ డితఁడు హరిహరి పసులఁ గాచె నిదివో హరిహరి
సిరికి మగఁడు దాను హరిహరి చెలఁగి రోలఁ దగిలె హరిహరి
పరగఁ జూడరోయి హరిహరి బదుకరోయి కొలిచి హరిహరి

(॥ఇత॥)
అమరవంద్యుఁ డితఁడు హరిహరి అణఁచెఁ గంసుని హరిహరి
వినుత దానవారి హరిహరి వించె మద్దులు హరిహరి
అమరె నిదివో హరిహరి శ్రీ వేంకటాద్రిమీఁద హరిహరి
జమళి రామకృష్ణుఁడు హరిహరి సర్వమితఁడు హరిహరి

(||pallavi||)
idanisaṁdamu harihari yemi sĕppam̐ gŏlam̐di harihari
adirahasyamula harihari adigo managum̐ jikkĕ harihari

(||ida||)
ādiviṣhṇum̐ ḍidam̐ḍu harihari adĕ yaśhodagŏḍugu harihari
vedamūrdi idam̐ḍĕ harihari vĕnnadŏṁgiliṁchĕ harihari
sādubaṁḍi viṟisĕ harihari saṁṭiviṣhamu sĕrisĕ harihari

(||ida||)
paramabaruṣhum̐ ḍidam̐ḍu harihari pasulam̐ gāsĕ nidivo harihari
sirigi magam̐ḍu dānu harihari sĕlam̐gi rolam̐ dagilĕ harihari
paragam̐ jūḍaroyi harihari badugaroyi kŏlisi harihari

(||ida||)
amaravaṁdyum̐ ḍidam̐ḍu harihari aṇam̐sĕm̐ gaṁsuni harihari
vinuda dānavāri harihari viṁchĕ maddulu harihari
amarĕ nidivo harihari śhrī veṁkaḍādrimīm̐da harihari
jamaḽi rāmakṛṣhṇum̐ḍu harihari sarvamidam̐ḍu harihari