(॥పల్లవి॥)
ఇతనికంటే నుపాయ మిఁక లేదు
మతిలోన నున్నవాఁడు మర్మమిదే సుండీ
(॥ఇత॥)
ఇన్ని లోకసుఖములు ఇంద్రియప్రీతులే
తన్నుఁ గనిన తల్లిదండ్రి తనుపోషకులే
కన్ను లెదిటిధనాలు కారణార్థములే
వున్నతి నిష్టార్థసిద్ధి కొక్కఁడే దేవుఁడు
(॥ఇత॥)
కల దేవత లిందరు కర్మఫలదాతలే
లలి విద్యలెల్ల ఖ్యాతిలాభపూజల కొరకే
పలుమంత్రము లెల్లను బ్రహ్మలోక మీసందివె
వొలిసి ఇష్టార్థసిద్ధి కొక్కఁడే దేవుఁడు
(॥ఇత॥)
అనుదిన రాజ సేవ లల్పార్థ హేతులే
కొనఁ గల్పవృక్షమైనఁ గోరిన విచ్చేటిదే
ఘన శ్రీవేంకటేశుఁడు కల్పించె జీవునిఁ గావ-
నొనర నిష్టార్థసిద్ధి కొక్కఁడే దేవుఁడు
(||pallavi||)
idanigaṁṭe nubāya mim̐ka ledu
madilona nunnavām̐ḍu marmamide suṁḍī
(||ida||)
inni logasukhamulu iṁdriyaprīdule
tannum̐ ganina tallidaṁḍri tanuboṣhagule
kannu lĕdiḍidhanālu kāraṇārdhamule
vunnadi niṣhṭārdhasiddhi kŏkkam̐ḍe devum̐ḍu
(||ida||)
kala devada liṁdaru karmaphaladādale
lali vidyalĕlla khyādilābhabūjala kŏrage
palumaṁtramu lĕllanu brahmaloga mīsaṁdivĕ
vŏlisi iṣhṭārdhasiddhi kŏkkam̐ḍe devum̐ḍu
(||ida||)
anudina rāja seva lalbārdha hedule
kŏnam̐ galbavṛkṣhamainam̐ gorina vichcheḍide
ghana śhrīveṁkaḍeśhum̐ḍu kalbiṁchĕ jīvunim̐ gāva-
nŏnara niṣhṭārdhasiddhi kŏkkam̐ḍe devum̐ḍu