ఇటని యెఱఁగమైతి మిందాఁకాను
(॥పల్లవి॥)
ఇటని యెఱఁగమైతి మిందాఁకాను
ఘటన లిన్నియు మీకె కలిగెనో కాక
(॥ఇట॥)
పవ్వళించి యింటిలోన పానుపుపై నీవుండఁగా
యెవ్వతే లేపదాయ యిందాఁకాను
నివ్వటిల్ల నీకు నంత నిదు రున్నదా తొల్లి
వువ్విళ్ళూర నేదో కాచుకున్నాఁడవు గాక
(॥ఇట॥)
వోరగాఁ దలుపు మూసు కొక్కఁడవే వుండఁగాను
యేరమణీ దగ్గరదు యిందాఁకాను
ఆరయ నీకు నెంతైనా నలుక వున్నదా తొల్లి
వూరకె యేటికో కాచుకున్నాఁడవు గాక
(॥ఇట॥)
కరఁగి కరఁగి నీవు కన్నులు మూసుకుండఁగా
యెరవు చేకో దెవ్వతే నిందాఁకాను
యిరవై శ్రీ వేంకటేశ యింతలో నిన్నుఁ గూడితిఁ
వొరయ నేఁటికో కాచుకున్నాఁడవు గాక
(||pallavi||)
iḍani yĕṟam̐gamaidi miṁdām̐kānu
ghaḍana linniyu mīgĕ kaligĕno kāga
(||iḍa||)
pavvaḽiṁchi yiṁṭilona pānububai nīvuṁḍam̐gā
yĕvvade lebadāya yiṁdām̐kānu
nivvaḍilla nīgu naṁta nidu runnadā tŏlli
vuvviḽḽūra nedo kāsugunnām̐ḍavu gāga
(||iḍa||)
voragām̐ dalubu mūsu kŏkkam̐ḍave vuṁḍam̐gānu
yeramaṇī daggaradu yiṁdām̐kānu
āraya nīgu nĕṁtainā naluga vunnadā tŏlli
vūragĕ yeḍigo kāsugunnām̐ḍavu gāga
(||iḍa||)
karam̐gi karam̐gi nīvu kannulu mūsuguṁḍam̐gā
yĕravu sego dĕvvade niṁdām̐kānu
yiravai śhrī veṁkaḍeśha yiṁtalo ninnum̐ gūḍidim̐
vŏraya nem̐ṭigo kāsugunnām̐ḍavu gāga