ఇటని విన్నవించరే ఇంతులాల పతితోను
(॥పల్లవి॥)
ఇటని విన్నవించరే ఇంతులాల పతితోను
తటుకున నిఁ(నిం?)పైతే దండకు రమ్మనరే
(॥॥)
మనవచ్చినయంతే మాఁటలు
కనుచూపు నాఁటినంతె కాంక్షలు
తనువులు సోఁకినంతె తమకములు
వినయములు గలయంతె వేడుకలు
(॥॥)
సరసములాడినంతె సంగాతాలు
సరుసఁ గొలిచినంతె సలిగెలు
మరిగియుండినంతె మంతనాలు
హరుషమైనయంతె ఆదరింపులు
(॥॥)
సముకముగలయంతె చనవులును
సుముఖత్వమైనయంతె చుట్టరికము
రమణుఁడు శ్రీవేకంటరాయుఁడు దాను
అమర నన్నేలె నేను అలమేలుమంగను
(||pallavi||)
iḍani vinnaviṁchare iṁtulāla padidonu
taḍuguna nim̐(niṁ?)paide daṁḍagu rammanare
(||||)
manavachchinayaṁte mām̐ṭalu
kanusūbu nām̐ṭinaṁtĕ kāṁkṣhalu
tanuvulu som̐kinaṁtĕ tamagamulu
vinayamulu galayaṁtĕ veḍugalu
(||||)
sarasamulāḍinaṁtĕ saṁgādālu
sarusam̐ gŏlisinaṁtĕ saligĕlu
marigiyuṁḍinaṁtĕ maṁtanālu
haruṣhamainayaṁtĕ ādariṁpulu
(||||)
samugamugalayaṁtĕ sanavulunu
sumukhatvamainayaṁtĕ suṭṭarigamu
ramaṇum̐ḍu śhrīvegaṁṭarāyum̐ḍu dānu
amara nannelĕ nenu alamelumaṁganu