Idameemdi panulagu yitte vegirimtunaa

ఇటమీఁది పనులకు యిట్టె వేగిరింతునా
Language

(॥పల్లవి॥)
ఇటమీఁది పనులకు యిట్టె వేగిరింతునా
కటకటా నే నంత కక్కూరితి సేతునా

(॥ఇటమీది॥)
యెగ్గు లెంచేదాననా యే మేమి నీవు సేసినా
వొగ్గి నీకు నావయసు వొప్పింతుఁ గాక
దగ్గరి నీ కెవ్వతో తప్పఁ జెప్పె నింతే కాక
వెగ్గళపు టలుకకు వేళ మీఁద లేదా

(॥ఇటమీది॥)
వెంగె మాడేదాననా వే రొకతెతో నవ్వితే
అంగము నీ కెక్కెనది యందుఁ గాక
మంగిట నీ కెవ్వతో ముడివెట్టె నింతే కాక
కంగి నిన్నుఁ దిట్టే నంటె కా దనేరా వొరులు

(॥ఇటమీది॥)
చలపట్టేదాననా సారె నీవు వేఁడుకొంటే
తెలిసి నీతోఁ దెప్పలఁ దేలుదుఁ గాక
బలిమి శ్రీవెంకటేశ పట్టి నన్నుఁ గూడితివి
చెలులు నాతోడివారా చేతి కిచ్చే వాపెను

(||pallavi||)
iḍamīm̐di panulagu yiṭṭĕ vegiriṁtunā
kaḍagaḍā ne naṁta kakkūridi sedunā

(||iḍamīdi||)
yĕggu lĕṁchedānanā ye memi nīvu sesinā
vŏggi nīgu nāvayasu vŏppiṁtum̐ gāga
daggari nī kĕvvado tappam̐ jĕppĕ niṁte kāga
vĕggaḽabu ṭalugagu veḽa mīm̐da ledā

(||iḍamīdi||)
vĕṁgĕ māḍedānanā ve rŏgadĕdo navvide
aṁgamu nī kĕkkĕnadi yaṁdum̐ gāga
maṁgiḍa nī kĕvvado muḍivĕṭṭĕ niṁte kāga
kaṁgi ninnum̐ diṭṭe naṁṭĕ kā danerā vŏrulu

(||iḍamīdi||)
salabaṭṭedānanā sārĕ nīvu vem̐ḍugŏṁṭe
tĕlisi nīdom̐ dĕppalam̐ deludum̐ gāga
balimi śhrīvĕṁkaḍeśha paṭṭi nannum̐ gūḍidivi
sĕlulu nādoḍivārā sedi kichche vābĕnu