Idameemdi kadamellaa nimka neevu deersavayyaa

ఇటమీఁది కడమెల్లా నిఁక నీవు దీర్చవయ్యా
Language

(॥పల్లవి॥)
ఇటమీఁది కడమెల్లా నిఁక నీవు దీర్చవయ్యా
పటుకునఁ జెలి నీకుఁ బాలువెట్టీ నిదిగో

(॥ఇట॥)
నెలఁత మంచము పై కిన్నెర వాయించి వాయించి
తలకొని నీవు రాఁగాఁ దలవంచెను
సొలసి చెలులతోడ సుద్దులు దాఁజెప్పిచెప్పి
చెలఁగి నీ మోము చూచి సిగ్గువడీ నిదిగో

(॥ఇట॥)
పడఁతి నీమీఁదిపాట పాడిపాడి అర్థము నీ-
వడిగితే నవ్వలి మోమై నవ్వీని
అడియాలములరూపు అద్దములోఁ జూచి చూచి
కడు నీవు కొంగువట్టఁగా భ్రమసీని

(॥ఇట॥)
సతి యేకతాన నుండి జవ్వాది పూసిపూసి
రతి నీవు గూడఁగా సరసమాడిని
ఇతవైన శ్రీ వేంకటేశ నీ వాపెఁ గూడఁగా
పతి చూచి యిప్పు డిట్టె పక్కున నవ్వీని

(||pallavi||)
iḍamīm̐di kaḍamĕllā nim̐ka nīvu dīrsavayyā
paḍugunam̐ jĕli nīgum̐ bāluvĕṭṭī nidigo

(||iḍa||)
nĕlam̐ta maṁchamu pai kinnĕra vāyiṁchi vāyiṁchi
talagŏni nīvu rām̐gām̐ dalavaṁchĕnu
sŏlasi sĕluladoḍa suddulu dām̐jĕppisĕppi
sĕlam̐gi nī momu sūsi sigguvaḍī nidigo

(||iḍa||)
paḍam̐ti nīmīm̐dibāḍa pāḍibāḍi ardhamu nī-
vaḍigide navvali momai navvīni
aḍiyālamularūbu addamulom̐ jūsi sūsi
kaḍu nīvu kŏṁguvaṭṭam̐gā bhramasīni

(||iḍa||)
sadi yegadāna nuṁḍi javvādi pūsibūsi
radi nīvu gūḍam̐gā sarasamāḍini
idavaina śhrī veṁkaḍeśha nī vābĕm̐ gūḍam̐gā
padi sūsi yippu ḍiṭṭĕ pakkuna navvīni