Idameemda sadi ninnu semi sesuno

ఇటమీఁద సతి నిన్ను సేమి సేసునో
Language

(॥పల్లవి॥)
ఇటమీఁద సతి నిన్ను సేమి సేసునో
తటుకున మీఁదటెత్తు తలఁచుకో యిపుడు

(॥ఇట॥)
తెఱవ కన్నుల నిద్రదేరేది మానిపేనంటా
మఱిచన్నులు విసికి మలసితివి
జఱసి యందుకుఁగాను జంకించె ఆకెఁ(కె?) దిట్టితే
తఱి పూవులచెండునఁ దాఁకవేసే విదివో

(॥ఇట॥)
వనితయలఁతపరవశము మానిసేనంటా
కొనగోర చెక్కు చురుకున నూఁదితి
పెనచి యందుకు నాకె బిగియించి పట్టితేను
మొనసి యట్టె కప్రములు చల్లేవిదివో

(॥ఇట॥)
ఇంతి నిన్నుఁ గూడినచొక్కిట్టె మానిపేనంటా
కాంతకెమ్మోవిమీఁద గంటిసేసితి
చెంత నందుకుఁగా నవ్వె శ్రీవేంకటేశ నిన్నాకె
పంతాన పన్నీరు పైపైఁ జల్లే విదివో

(||pallavi||)
iḍamīm̐da sadi ninnu semi sesuno
taḍuguna mīm̐daḍĕttu talam̐sugo yibuḍu

(||iḍa||)
tĕṟava kannula nidraderedi mānibenaṁṭā
maṟisannulu visigi malasidivi
jaṟasi yaṁdugum̐gānu jaṁkiṁchĕ āgĕm̐(kĕ?) diṭṭide
taṟi pūvulasĕṁḍunam̐ dām̐kavese vidivo

(||iḍa||)
vanidayalam̐tabaravaśhamu mānisenaṁṭā
kŏnagora sĕkku suruguna nūm̐didi
pĕnasi yaṁdugu nāgĕ bigiyiṁchi paṭṭidenu
mŏnasi yaṭṭĕ kapramulu sallevidivo

(||iḍa||)
iṁti ninnum̐ gūḍinasŏkkiṭṭĕ mānibenaṁṭā
kāṁtagĕmmovimīm̐da gaṁṭisesidi
sĕṁta naṁdugum̐gā navvĕ śhrīveṁkaḍeśha ninnāgĕ
paṁtāna pannīru paibaim̐ jalle vidivo