Idameemda neesittamu yeṟugagalavaamdavu

ఇటమీఁద నీచిత్తము యెఱుకగలవాఁడవు
Language

(॥పల్లవి॥)
ఇటమీఁద నీచిత్తము యెఱుకగలవాఁడవు
తటుకన నింకానేమి దండమువెట్టేను

(॥ఇట॥)
కోరినకోరిక నీవు గుఱి నీచక్కఁదనము
వేరే నీకు నిఁకనేమి విన్నవించేను
జారె నాపయ్యద నీకు చన్నులివి కానుకాయ
గారవాన నిఁకనేమి కప్పమిచ్చేను

(॥ఇట॥)
అంగము నీవద్దనుండి ఆయము నీచేతిది
అంగవించి యెందాఁకాఁ బ్రియము చెప్పేనే
ముంగిట వెరగందితి ముట్టితివి నీవు నన్ను
యెంగిలిమోవివిందు లేమి చెప్పేను

(॥ఇట॥)
గక్కనఁ గూడితి నిన్ను కాఁగిలి నీసొమ్మాయ
చిక్కించు కెంతతడవు సేసవెట్టేను
అక్కున శ్రీవేంకటేశ ఆలను నీవు పతివి
పక్కన మరేమి నిన్ను బాసగొనేను

(||pallavi||)
iḍamīm̐da nīsittamu yĕṟugagalavām̐ḍavu
taḍugana niṁkānemi daṁḍamuvĕṭṭenu

(||iḍa||)
korinagoriga nīvu guṟi nīsakkam̐danamu
vere nīgu nim̐kanemi vinnaviṁchenu
jārĕ nābayyada nīgu sannulivi kānugāya
gāravāna nim̐kanemi kappamichchenu

(||iḍa||)
aṁgamu nīvaddanuṁḍi āyamu nīsedidi
aṁgaviṁchi yĕṁdām̐kām̐ briyamu sĕppene
muṁgiḍa vĕragaṁdidi muṭṭidivi nīvu nannu
yĕṁgilimoviviṁdu lemi sĕppenu

(||iḍa||)
gakkanam̐ gūḍidi ninnu kām̐gili nīsŏmmāya
sikkiṁchu kĕṁtadaḍavu sesavĕṭṭenu
akkuna śhrīveṁkaḍeśha ālanu nīvu padivi
pakkana maremi ninnu bāsagŏnenu