Idameemda neesitta mimtegaaga

ఇటమీఁద నీచిత్త మింతేకాక
Language

(॥పల్లవి॥)
ఇటమీఁద నీచిత్త మింతేకాక
చిటుకున నంతవిచ్చి చెప్పనేల యిఁకను

(॥ఇట॥)
నీమాట మన్నించె నీమోము దప్పక చూచె
యేమిసేసు జవరాలు యింతకంటేను
ప్రేమ మెల్లా నీపైఁ జల్లె పెనఁగక సమ్మతించె
కామినివల్ల మరి కడమేది యిఁకను

(॥ఇట॥)
చేతికిఁ గానుక యిచ్చె సిగ్గుతోడఁ దలవంచె
యీతల నేమి సేసు యింతకంటెను
నీతితో సేవలు సేసె నీ కిచ్చకమే నెఱపె
నాతికి బుద్దులు చెప్ప నాయమేది యిఁకను

(॥ఇట॥)
పాదములు నీకు నొత్తె బాగాలు చేతికిచ్చె
యీదెసఁ బంత మెట్టిచ్చు నింతకంటెను
ఆదుకొని శ్రీవేంకటాధిప నిన్నుఁ బెండ్లాడె
శ్రీదేవి నేరుపులు చెవ్పేదేమి యిఁకను

(||pallavi||)
iḍamīm̐da nīsitta miṁtegāga
siḍuguna naṁtavichchi sĕppanela yim̐kanu

(||iḍa||)
nīmāḍa manniṁchĕ nīmomu dappaga sūsĕ
yemisesu javarālu yiṁtagaṁṭenu
prema mĕllā nībaim̐ jallĕ pĕnam̐gaga sammadiṁchĕ
kāminivalla mari kaḍamedi yim̐kanu

(||iḍa||)
sedigim̐ gānuga yichchĕ siggudoḍam̐ dalavaṁchĕ
yīdala nemi sesu yiṁtagaṁṭĕnu
nīdido sevalu sesĕ nī kichchagame nĕṟabĕ
nādigi buddulu sĕppa nāyamedi yim̐kanu

(||iḍa||)
pādamulu nīgu nŏttĕ bāgālu sedigichchĕ
yīdĕsam̐ baṁta mĕṭṭichchu niṁtagaṁṭĕnu
ādugŏni śhrīveṁkaḍādhiba ninnum̐ bĕṁḍlāḍĕ
śhrīdevi nerubulu sĕvpedemi yim̐kanu