Idameemda neesitta midivo naa vinnabamu

ఇటమీఁద నీచిత్త మిదివో నా విన్నపము
Language

(॥పల్లవి॥)
ఇటమీఁద నీచిత్త మిదివో నా విన్నపము
కుటిలకుంత లీదెస గుఱుతుగాఁ జూడుమా

(॥॥)
కలసి మెలఁగుదాఁకాఁ గన్నులనే వుండు నాస
సెలవినే వుండు నవ్వు చెనకుదాఁకా
పిలి చాదరించుదాఁకా పెదవిపై నుండు మాట
చెలియకు నీమీఁదఁ జెప్పరాదు ప్రియము

(॥॥)
పానుపు చేరినదాఁకా పాదాలనే వుండుఁ దమి
నాని సిగ్గుచేత నుండు ననపుదాఁకా
మోనాన మోవేనుదాఁకా మొకాన నున్నది దప్పి
పూనినమోహ మెట్టిదో పొలఁతి నీ మీఁదను

(॥॥)
కూడి రతిసేయుదాఁకాఁ గుచాల నుండుఁ గోరిక
జోడించి మైఁగాఁక యిందు చొక్కుదాఁకాను
యీడుగాను శ్రీవేంకటెశ ఇంతిఁ గూడితివి
తోడునీడవలె నుండుఁ దొయ్యలి నీ వలపు

(||pallavi||)
iḍamīm̐da nīsitta midivo nā vinnabamu
kuḍilaguṁta līdĕsa guṟudugām̐ jūḍumā

(||||)
kalasi mĕlam̐gudām̐kām̐ gannulane vuṁḍu nāsa
sĕlavine vuṁḍu navvu sĕnagudām̐kā
pili sādariṁchudām̐kā pĕdavibai nuṁḍu māḍa
sĕliyagu nīmīm̐dam̐ jĕpparādu priyamu

(||||)
pānubu serinadām̐kā pādālane vuṁḍum̐ dami
nāni sigguseda nuṁḍu nanabudām̐kā
monāna movenudām̐kā mŏgāna nunnadi dappi
pūninamoha mĕṭṭido pŏlam̐ti nī mīm̐danu

(||||)
kūḍi radiseyudām̐kām̐ gusāla nuṁḍum̐ goriga
joḍiṁchi maim̐gām̐ka yiṁdu sŏkkudām̐kānu
yīḍugānu śhrīveṁkaḍĕśha iṁtim̐ gūḍidivi
toḍunīḍavalĕ nuṁḍum̐ dŏyyali nī valabu