ఇటమీఁద నీచిత్త మెట్టువలసినఁ జేయు
(॥పల్లవి॥)
ఇటమీఁద నీచిత్త మెట్టువలసినఁ జేయు
కుటిలాలకి(క?) వలపు గుఱుతాయనయ్యా
(॥ఇట॥)
తనువు పానుపు మీఁద తలఁపెల్ల నీమీఁద
కనుచూపు లివి నీరాకలమీఁద
వినయాలు చెలులతో వేసట మరునితోను
వనితవలపు లింత వన్నెకెక్కెనయ్యా
(॥ఇట॥)
చెక్కుకుఁజేయివచ్చె సెలవికి నవ్వువచ్చె
ముక్కుమీఁదివేలితోడ మోనము వచ్చె
పుక్కిట నూర్పులు నిండె పొందులు కోర్కుల నిండె
చక్కనింతి వలపు లీచందమాయనయ్యా
(॥ఇట॥)
కళలు మోమున కెక్కె కాఁగిలి నీకు నెక్కె
తలకొన్నసంతసము తలకెక్కె
యెలిమి శ్రీవేంకటేశ ఇంతి నీవు గూడఁగాను
జలజాక్షివలపులు సతమాయనయ్యా
(||pallavi||)
iḍamīm̐da nīsitta mĕṭṭuvalasinam̐ jeyu
kuḍilālagi(ka?) valabu guṟudāyanayyā
(||iḍa||)
tanuvu pānubu mīm̐da talam̐pĕlla nīmīm̐da
kanusūbu livi nīrāgalamīm̐da
vinayālu sĕlulado vesaḍa marunidonu
vanidavalabu liṁta vannĕgĕkkĕnayyā
(||iḍa||)
sĕkkugum̐jeyivachchĕ sĕlavigi navvuvachchĕ
mukkumīm̐divelidoḍa monamu vachchĕ
pukkiḍa nūrbulu niṁḍĕ pŏṁdulu korgula niṁḍĕ
sakkaniṁti valabu līsaṁdamāyanayyā
(||iḍa||)
kaḽalu momuna kĕkkĕ kām̐gili nīgu nĕkkĕ
talagŏnnasaṁtasamu talagĕkkĕ
yĕlimi śhrīveṁkaḍeśha iṁti nīvu gūḍam̐gānu
jalajākṣhivalabulu sadamāyanayyā