Idameemda neesitta meduvalasinam jeyi

ఇటమీఁద నీచిత్త మెటువలసినఁ జేయి
Language

(॥పల్లవి॥)
ఇటమీఁద నీచిత్త మెటువలసినఁ జేయి
కుటిలపు రమణుఁడ గురిలేదు వలపు

(॥ఇట॥)
తుమ్మిదరవము విని తొంటిహెగ్గాళేలంటా
తమ్మికంటి యాసలతో దగ్గరిపోయి
వుమ్మడిఁ దప్పకచూచి వుల్లమెల్ల వక్కలై
సొమ్మసిల్లె నిఁకఁ జెప్పి చూపరాదు వలపు

(॥ఇట॥)
కలికిచంద్రోదయము ఘనుఁడ నీపఁజుల -
వెలుఁగంటా నెదురేఁగి వెలఁది నేఁడు
చలివాయ నవి చూచి చంచలించి వెరగంది
అలివేణి పులకించె నాఁపరాదు వలపు

(॥ఇట॥)
పచ్చనితోఁపులు చూచి పట్టునీగొల్లెనంటా
ఇచ్చగించి కొమ్మ నీఇంటికిఁ బోయి
అచ్చట శ్రీవేంకటేశ అటు నిన్నుఁ గని కూడె
మచ్చికతమకముల ముట్టులేదు వలపు

(||pallavi||)
iḍamīm̐da nīsitta mĕḍuvalasinam̐ jeyi
kuḍilabu ramaṇum̐ḍa guriledu valabu

(||iḍa||)
tummidaravamu vini tŏṁṭihĕggāḽelaṁṭā
tammigaṁṭi yāsalado daggariboyi
vummaḍim̐ dappagasūsi vullamĕlla vakkalai
sŏmmasillĕ nim̐kam̐ jĕppi sūbarādu valabu

(||iḍa||)
kaligisaṁdrodayamu ghanum̐ḍa nībam̐jula -
vĕlum̐gaṁṭā nĕdurem̐gi vĕlam̐di nem̐ḍu
salivāya navi sūsi saṁchaliṁchi vĕragaṁdi
aliveṇi pulagiṁchĕ nām̐parādu valabu

(||iḍa||)
pachchanidom̐pulu sūsi paṭṭunīgŏllĕnaṁṭā
ichchagiṁchi kŏmma nīiṁṭigim̐ boyi
achchaḍa śhrīveṁkaḍeśha aḍu ninnum̐ gani kūḍĕ
machchigadamagamula muṭṭuledu valabu