Idameemda meesitta metlogaani

ఇటమీఁద మీచిత్త మెట్లోకాని
Language

(॥పల్లవి॥)
ఇటమీఁద మీచిత్త మెట్లోకాని
కుటిలకుంతలి పొందే గుణము వో విభుఁడా

(॥ఇట॥)
యింతి నీకు మేడమీఁద నెదురుచూచినచూపు
దొంతులై పెరిగి మరుతూపులాయను
యింతట విచ్చేయకున్న యివియిన్నియునువేవై
చెంతల వడ్డికిఁ బారు చెప్పితిఁబో విభుఁడా

(॥ఇట॥)
వాలినయాసలతో వనిత వలపులెల్ల
చాలుకొని శాఖోపశాఖలాయను
తాలిమి నింతటనైనా దయదలఁచకవుంటే
కాలఁ జేతఁ బెనగొను కనునో విభుఁడా

(॥ఇట॥)
మెలుఁత జవ్వనమెల్ల మించినసొబగుఁలెల్లా
గలయురతులఁ జెప్పఁ గతలాయను
యెలమి శ్రీవేంకటేశ యిట్లఁ గూడకుండితే
తలపోఁతే ఘనమవును తప్పదువో విభుఁడా

(||pallavi||)
iḍamīm̐da mīsitta mĕṭlogāni
kuḍilaguṁtali pŏṁde guṇamu vo vibhum̐ḍā

(||iḍa||)
yiṁti nīgu meḍamīm̐da nĕdurusūsinasūbu
dŏṁtulai pĕrigi marudūbulāyanu
yiṁtaḍa vichcheyagunna yiviyinniyunuvevai
sĕṁtala vaḍḍigim̐ bāru sĕppidim̐bo vibhum̐ḍā

(||iḍa||)
vālinayāsalado vanida valabulĕlla
sālugŏni śhākhobaśhākhalāyanu
tālimi niṁtaḍanainā dayadalam̐sagavuṁṭe
kālam̐ jedam̐ bĕnagŏnu kanuno vibhum̐ḍā

(||iḍa||)
mĕlum̐ta javvanamĕlla miṁchinasŏbagum̐lĕllā
galayuradulam̐ jĕppam̐ gadalāyanu
yĕlami śhrīveṁkaḍeśha yiṭlam̐ gūḍaguṁḍide
talabom̐te ghanamavunu tappaduvo vibhum̐ḍā