(॥పల్లవి॥)
ఇతఁడు నా మగఁడౌట యెఱఁగవటే
రతికెక్కఁ జెనకేవు రమణుని నిపుడే
(॥ఇతఁ॥)
పొందులు చూపే వెదుటఁ బుక్కిటఁ దమ్మదాపేవు
యిందుఁగానియీపగటు యెరఁగరటే
కందువకు వచ్చేవు కానుకలు నిచ్చేవు
యిదరలో నా నీకు నెంత పని గలదే
(॥ఇతఁ॥)
సారె సారెఁ బొలసేవు చనవుతో సొలసేవు
నేరుపు లిందునఁగాని నెగడవటే
మేరమీరి నవ్వేవు మేలములు దవ్వేవు
వూరకే వలపులెల్లా నుమ్మగిలీ నటవే
(॥ఇతఁ॥)
జిగిచన్నులఁ గమ్మేవు చెమట గోరఁ జిమ్మేవు
తగులు నీకిందుఁగాని దాకొనంటే
నిగిడి శ్రీవేంకటాద్రి నిలయుఁడు నన్నునేలె
మొగము చూసేవు నీకు మోహమెంత గలదే
(||pallavi||)
idam̐ḍu nā magam̐ḍauḍa yĕṟam̐gavaḍe
radigĕkkam̐ jĕnagevu ramaṇuni nibuḍe
(||idam̐||)
pŏṁdulu sūbe vĕduḍam̐ bukkiḍam̐ dammadābevu
yiṁdum̐gāniyībagaḍu yĕram̐garaḍe
kaṁduvagu vachchevu kānugalu nichchevu
yidaralo nā nīgu nĕṁta pani galade
(||idam̐||)
sārĕ sārĕm̐ bŏlasevu sanavudo sŏlasevu
nerubu liṁdunam̐gāni nĕgaḍavaḍe
meramīri navvevu melamulu davvevu
vūrage valabulĕllā nummagilī naḍave
(||idam̐||)
jigisannulam̐ gammevu sĕmaḍa goram̐ jimmevu
tagulu nīgiṁdum̐gāni dāgŏnaṁṭe
nigiḍi śhrīveṁkaḍādri nilayum̐ḍu nannunelĕ
mŏgamu sūsevu nīgu mohamĕṁta galade