Idamde naavaamdaide nevvarigee lomganela

ఇతఁడే నావాఁడైతే నెవ్వరికీ లోఁగనేల
Language

(॥పల్లవి॥)
ఇతఁడే నావాఁడైతే నెవ్వరికీ లోఁగనేల
కతగా యీ వుపాయము గంటినే వోచెలియా

(॥ఇతఁ॥)
చిలుకలు పలుకనీ చేరి కోవిల గూయనీ
చెలువుఁ డాడినమాట చెప్పఁగదవే
కలువలు మెరయనీ కమలాలు చెలఁగనీ
తలఁపు దెలిసితివా తగిలి నీవతని

(॥ఇతఁ॥)
చందురుఁడు రానీవే చల్లగా లేతేరనీవే
యిందుకు వచ్చెనా తాను యెఱిఁగించవే
ఇందిందిరాలు రేఁగనీ యిగిరించనీ తీగెలు
కందువ నాపై బత్తిగఁదా విభునికి

(॥ఇతఁ॥)
కప్పుర మగ్గువగానీ గందవొడెక్కుడుగానీ
వొప్పుగఁ బానుపుపై నాతఁడున్నాఁడటే
కప్పి వసంతకాలము గానీ మరుఁ డెసగనీ
యిప్పుడు వచ్చి శ్రీవేంకటేశుఁడేలె నన్నును

(||pallavi||)
idam̐ḍe nāvām̐ḍaide nĕvvarigī lom̐ganela
kadagā yī vubāyamu gaṁṭine vosĕliyā

(||idam̐||)
silugalu paluganī seri kovila gūyanī
sĕluvum̐ ḍāḍinamāḍa sĕppam̐gadave
kaluvalu mĕrayanī kamalālu sĕlam̐ganī
talam̐pu dĕlisidivā tagili nīvadani

(||idam̐||)
saṁdurum̐ḍu rānīve sallagā lederanīve
yiṁdugu vachchĕnā tānu yĕṟim̐giṁchave
iṁdiṁdirālu rem̐ganī yigiriṁchanī tīgĕlu
kaṁduva nābai battigam̐dā vibhunigi

(||idam̐||)
kappura magguvagānī gaṁdavŏḍĕkkuḍugānī
vŏppugam̐ bānububai nādam̐ḍunnām̐ḍaḍe
kappi vasaṁtagālamu gānī marum̐ ḍĕsaganī
yippuḍu vachchi śhrīveṁkaḍeśhum̐ḍelĕ nannunu