ఇట మీఁదఁ జవిగాదు యేమన్నాను
(॥పల్లవి॥)
ఇట మీఁదఁ జవిగాదు యేమన్నాను
చిటుక వేసినంతలో చెప్పినట్టు సేయనా
(॥ఇట॥)
కోపగించుకొని నిన్ను గొణఁగినదానఁ గాన
పైపై సిగ్గుపడి యేమీఁ బలుకఁగాక
యేపునఁదొల్లిటివలె నిట్టె నాయంత వుంటేను
మాపుదాఁకా నీతోను మాటలే యాడనా
(॥ఇట॥)
చలము నీతో నేను సాదించినదానఁ గాన
చెలఁగి నీకుఁ బ్రియాలు చెప్పఁగాక
పొలసి నీపాలికి నేఁ బొరుగుదాననై వుంటే
చెలిమి నెరపి నీకు సేవలెల్లాఁ జేయనా
(॥ఇట॥)
నంటు సేసి యేడనైనా నవ్వినట్టిదానఁ గాన
గొంటుఁజందమున నిన్నుఁగూడితిఁ గాక
అంటి ముట్టి శ్రీ వేంకటాధిప నన్నే లితివి
యింటికాడ నీకు నేను యిచ్చకమే యాడనా
(||pallavi||)
iḍa mīm̐dam̐ javigādu yemannānu
siḍuga vesinaṁtalo sĕppinaṭṭu seyanā
(||iḍa||)
kobagiṁchugŏni ninnu gŏṇam̐ginadānam̐ gāna
paibai siggubaḍi yemīm̐ balugam̐gāga
yebunam̐dŏlliḍivalĕ niṭṭĕ nāyaṁta vuṁṭenu
mābudām̐kā nīdonu māḍale yāḍanā
(||iḍa||)
salamu nīdo nenu sādiṁchinadānam̐ gāna
sĕlam̐gi nīgum̐ briyālu sĕppam̐gāga
pŏlasi nībāligi nem̐ bŏrugudānanai vuṁṭe
sĕlimi nĕrabi nīgu sevalĕllām̐ jeyanā
(||iḍa||)
naṁṭu sesi yeḍanainā navvinaṭṭidānam̐ gāna
gŏṁṭum̐jaṁdamuna ninnum̐gūḍidim̐ gāga
aṁṭi muṭṭi śhrī veṁkaḍādhiba nanne lidivi
yiṁṭigāḍa nīgu nenu yichchagame yāḍanā