Ichchalonidaana nenu innidaa neegu

ఇచ్చలోనిదాన నేను ఇన్నిటా నీకు
Language

(॥పల్లవి॥)
ఇచ్చలోనిదాన నేను ఇన్నిటా నీకు
గచ్చు లేమిటికిరా చేఁగలమఱ్ఱిచెన్నుఁడా

(॥॥)
ఆరితేరి కతలెల్లా నడుగుతా నన్ను నీవు
చేరి యానవెట్టకురా చెప్పేఁగాని
దూరుసేయ కిఁకనైనా దోసము లేదనరా
సారెసారె నీకు మొక్కి జట్టిగొనే నేను

(॥॥)
వొగ్గి కొంగువట్టుకొని వొకటొకటే యడిగి
సిగ్గులువడకురా చెప్పేఁగాని
అగ్గలమై కిందుపడి ఆసుద్దులు మఱవరా
అగ్గమై నీవూడిగాలే అన్నీఁ జేసే నేను

(॥॥)
యెన్నిఁగ శ్రీ వేంకటాద్రి నిరవై నన్నేలితివి
చిన్ని గోరు దియ్యకురా చెప్పేఁగాని
మన్నించితి వెప్పుడు నామచ్చిక దలఁచరా
సన్నల నీరతులకే సమ్మతించే నేను

(||pallavi||)
ichchalonidāna nenu inniḍā nīgu
gachchu lemiḍigirā sem̐galamaṭrisĕnnum̐ḍā

(||||)
ārideri kadalĕllā naḍugudā nannu nīvu
seri yānavĕṭṭagurā sĕppem̐gāni
dūruseya kim̐kanainā dosamu ledanarā
sārĕsārĕ nīgu mŏkki jaṭṭigŏne nenu

(||||)
vŏggi kŏṁguvaṭṭugŏni vŏgaḍŏgaḍe yaḍigi
sigguluvaḍagurā sĕppem̐gāni
aggalamai kiṁdubaḍi āsuddulu maṟavarā
aggamai nīvūḍigāle annīm̐ jese nenu

(||||)
yĕnnim̐ga śhrī veṁkaḍādri niravai nannelidivi
sinni goru diyyagurā sĕppem̐gāni
manniṁchidi vĕppuḍu nāmachchiga dalam̐sarā
sannala nīradulage sammadiṁche nenu