Ichchaguraalanu nenu yinnidaam danabattugu

ఇచ్చకురాలను నేను యిన్నిటాఁ దనపట్టుకు
Language

(॥పల్లవి॥)
ఇచ్చకురాలను నేను యిన్నిటాఁ దనపట్టుకు
వచ్చి వచ్చి తనతోను వాదించేవారెవ్వరే

(॥ఇచ్చ॥)
మొదల సిగ్గువిడిచి మోహించినవారికి
యెదుట నెవ్వరున్నా నేమాయనే
పొదిగి యాపెకుఁ దాను పూవులు ముడిచీ నిట్టే
వదలక వొద్దనేటి వారెవ్వరే

(॥ఇచ్చ॥)
వెరవుతోడుత రతివేడుకనున్న వారికి
యెరవును మొఱఁగును యేడదే మరి
అరుదుగ నాపెకు నాకు మడిచిచ్చీఁ దాను
వరుస నిందుకు నవ్వే వారెవ్వరే

(॥ఇచ్చ॥)
చింతలన్నియు విడిచి సేసవెట్టేవారికి
యింతులలో నౌఁగాములు యిఁకనేడవే
చెంతనుండి తానే కూడె శ్రీ వేంకటేశుఁడు నన్ను
వంతు లిందు కడిగేటి వారెవ్వరే

(||pallavi||)
ichchagurālanu nenu yinniḍām̐ danabaṭṭugu
vachchi vachchi tanadonu vādiṁchevārĕvvare

(||ichcha||)
mŏdala sigguviḍisi mohiṁchinavārigi
yĕduḍa nĕvvarunnā nemāyane
pŏdigi yābĕgum̐ dānu pūvulu muḍisī niṭṭe
vadalaga vŏddaneḍi vārĕvvare

(||ichcha||)
vĕravudoḍuda radiveḍuganunna vārigi
yĕravunu mŏṟam̐gunu yeḍade mari
aruduga nābĕgu nāgu maḍisichchīm̐ dānu
varusa niṁdugu navve vārĕvvare

(||ichcha||)
siṁtalanniyu viḍisi sesavĕṭṭevārigi
yiṁtulalo naum̐gāmulu yim̐kaneḍave
sĕṁtanuṁḍi tāne kūḍĕ śhrī veṁkaḍeśhum̐ḍu nannu
vaṁtu liṁdu kaḍigeḍi vārĕvvare