Ichchaguraalane nenu yemayyaa

ఇచ్చకురాలనే నేను యేమయ్యా
Language

(॥పల్లవి॥)
ఇచ్చకురాలనే నేను యేమయ్యా
యెచ్చరించ వచ్చేవు నన్నే మయ్యా

(॥ఇచ్చ॥)
అదనఁ బాదముఁ దొక్కేనని నన్ను నడిగేవు
యెదురాడేనా నీతో నేమయ్యా
వదలుఁబయ్యదలోని వటువచన్ను లంటేవు
యిదె తప్పించుకొనేనా యేమయ్యా

(॥ఇచ్చ॥)
చెట్టి వట్టి తీసి నాచేతికి విడె మిచ్చేవు
యిట్టె వొల్ల ననేనా యేమయ్యా
పట్టి పాదా లొత్తుమని పైపైఁ దమకించేవు
యెటపనెదుట నుందాన నేమయ్యా

(॥ఇచ్చ॥)
నెయ్యముతోఁ గాఁగిలించి నీ విటు వేఁడుకొనేవు
యియ్యకొననా నేమి యేమయ్యా
చయ్యన నన్నేలితి వాసల శ్రీవేంకటేశ్వర
యియ్యడ నవ్వులు నవ్వే వేమయ్యా

(||pallavi||)
ichchagurālane nenu yemayyā
yĕchchariṁcha vachchevu nanne mayyā

(||ichcha||)
adanam̐ bādamum̐ dŏkkenani nannu naḍigevu
yĕdurāḍenā nīdo nemayyā
vadalum̐bayyadaloni vaḍuvasannu laṁṭevu
yidĕ tappiṁchugŏnenā yemayyā

(||ichcha||)
sĕṭṭi vaṭṭi tīsi nāsedigi viḍĕ michchevu
yiṭṭĕ vŏlla nanenā yemayyā
paṭṭi pādā lŏttumani paibaim̐ damagiṁchevu
yĕḍabanĕduḍa nuṁdāna nemayyā

(||ichcha||)
nĕyyamudom̐ gām̐giliṁchi nī viḍu vem̐ḍugŏnevu
yiyyagŏnanā nemi yemayyā
sayyana nannelidi vāsala śhrīveṁkaḍeśhvara
yiyyaḍa navvulu navve vemayyā