Ichchagamulaadedi illaalanu

ఇచ్చకములాడేటి ఇల్లాలను
Language

(॥పల్లవి॥)
ఇచ్చకములాడేటి ఇల్లాలను
పచ్చిగా నొకరివలె భ్రమయించనేరను

(॥ఇచ్చ॥)
తలఁచుకొమ్మనవే తా నాడినమాటలు
తెలుసుకొమ్మనవే చింతించి బుద్దులు
నిలుచున్నాఁడు వాకిటనే తనతో నేమనేన
పలికి వొకరివలె భ్రమయించనేరను

(॥ఇచ్చ॥)
చదువుకొమ్మనవే సారె మరుశాస్త్రాలు
వెదకుమనవే తనవింతసేఁతలు
యెదుట నుండఁగ తన కిట్టె నే మొగమోడితి
పదరివొకరివలె భ్రమయించనేరను

(॥ఇచ్చ॥)
సిరులఁ జూడుమనవేసేవలిందరివిని
కరఁగుమనవే తనగట్టిమనసు
యిరవై శ్రీవేంకటేశుఁ డెనసె నేనే మెచ్చితి
పరగనొకరివలె భ్రమయించనేరను

(||pallavi||)
ichchagamulāḍeḍi illālanu
pachchigā nŏgarivalĕ bhramayiṁchaneranu

(||ichcha||)
talam̐sugŏmmanave tā nāḍinamāḍalu
tĕlusugŏmmanave siṁtiṁchi buddulu
nilusunnām̐ḍu vāgiḍane tanado nemanena
paligi vŏgarivalĕ bhramayiṁchaneranu

(||ichcha||)
saduvugŏmmanave sārĕ maruśhāstrālu
vĕdagumanave tanaviṁtasem̐talu
yĕduḍa nuṁḍam̐ga tana kiṭṭĕ ne mŏgamoḍidi
padarivŏgarivalĕ bhramayiṁchaneranu

(||ichcha||)
sirulam̐ jūḍumanavesevaliṁdarivini
karam̐gumanave tanagaṭṭimanasu
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍĕnasĕ nene mĕchchidi
paraganŏgarivalĕ bhramayiṁchaneranu