Ichchagamulaadaraadaa yemaayanu

ఇచ్చకములాడరాదా యేమాయను
Language

(॥పల్లవి॥)
ఇచ్చకములాడరాదా యేమాయను
యిచ్చిన బాసలెల్లా నేమాయను

(॥ఇచ్చ॥)
రాతిరి మాఁటలకే రామ యెగ్గులువట్టెను
యీతలఁ బంతమీరాదా యేమాయను
యేతులఁ జూపినందుకే యెదుటఁ దలవంచీని
చేతఁ జెక్కు నొక్కరాదా చెలఁగి యేమాయను

(॥ఇచ్చ॥)
యేకతపునవ్వులకే ఇంతి సిగ్గులనలసె
యేకమై వేఁడుకోరాదా యేమాయను
కాకరిచేఁతలకే కన్నుల జంకించేని
జోకఁ గాఁగిలించరాదా సొంపులనేమాయను

(॥ఇచ్చ॥)
రతులమచ్చికలకే రమణి నివ్వెరఁగందె
యితవులు సేయరాదా యేమాయను
తతితో శ్రీవేంకటేశ తమకించి నన్నుఁ గూడి
చతురత చూపరాదా చల్లఁగా నేమాయను

(||pallavi||)
ichchagamulāḍarādā yemāyanu
yichchina bāsalĕllā nemāyanu

(||ichcha||)
rādiri mām̐ṭalage rāma yĕgguluvaṭṭĕnu
yīdalam̐ baṁtamīrādā yemāyanu
yedulam̐ jūbinaṁduge yĕduḍam̐ dalavaṁchīni
sedam̐ jĕkku nŏkkarādā sĕlam̐gi yemāyanu

(||ichcha||)
yegadabunavvulage iṁti siggulanalasĕ
yegamai vem̐ḍugorādā yemāyanu
kāgarisem̐talage kannula jaṁkiṁcheni
jogam̐ gām̐giliṁcharādā sŏṁpulanemāyanu

(||ichcha||)
radulamachchigalage ramaṇi nivvĕram̐gaṁdĕ
yidavulu seyarādā yemāyanu
tadido śhrīveṁkaḍeśha tamagiṁchi nannum̐ gūḍi
sadurada sūbarādā sallam̐gā nemāyanu