(॥పల్లవి॥)
ఇచ్చకము సేయవే యియ్యకొనవే
రచ్చల నాతని నింత రాఁపు సేయఁ దగునా
(॥ఇచ్చ॥)
వొడి వట్టి తియ్యఁగాను వోవ నందురటవే
కడఁగి యాతనిమాట కైకొంట గాక
వుడివోని జవ్వనము వొడలిపైఁ బెట్టుకొని
పడఁతికి నలుకలు పాటించఁ జెల్లునా
(॥ఇచ్చ॥)
తగిలి నీతో నవ్వఁగా తల వంతురటవే
మగని చిత్తము రాను మనుట గాక
తెగరాని తమకము దేహములో నించుకొని
మగనితో చలములు మరి సేయ వచ్చునా
(॥ఇచ్చ॥)
పిలిచి కాఁగిలించఁగా పెనఁగుదు రటవే
సొలయక సంతోసానఁ జొక్కుట గాక
అలమేలు మంగవు నీ వారలకు లోనై
యిల శ్రీ వేంకటేశుఁ గూడెలయించఁ దగవా
(||pallavi||)
ichchagamu seyave yiyyagŏnave
rachchala nādani niṁta rām̐pu seyam̐ dagunā
(||ichcha||)
vŏḍi vaṭṭi tiyyam̐gānu vova naṁduraḍave
kaḍam̐gi yādanimāḍa kaigŏṁṭa gāga
vuḍivoni javvanamu vŏḍalibaim̐ bĕṭṭugŏni
paḍam̐tigi nalugalu pāḍiṁcham̐ jĕllunā
(||ichcha||)
tagili nīdo navvam̐gā tala vaṁturaḍave
magani sittamu rānu manuḍa gāga
tĕgarāni tamagamu dehamulo niṁchugŏni
maganido salamulu mari seya vachchunā
(||ichcha||)
pilisi kām̐giliṁcham̐gā pĕnam̐gudu raḍave
sŏlayaga saṁtosānam̐ jŏkkuḍa gāga
alamelu maṁgavu nī vāralagu lonai
yila śhrī veṁkaḍeśhum̐ gūḍĕlayiṁcham̐ dagavā