ఇచ్చకము సేయ వచ్చే వేమందును
(॥పల్లవి॥)
ఇచ్చకము సేయ వచ్చే వేమందును
బచ్చెన సటకాఁడవు భళరా మెచ్చితిని
(॥ఇచ్చ॥)
చేయి వట్టి పెనఁగేవు చెక్కు నొక్క వచ్చేవు
యీయెడ నీతో నింక నే మందును
చాయలకె నవ్వేవు సరసము లాడేవు
పాయపువగకాఁడవు భళరా మెచ్చితిని
(॥ఇచ్చ॥)
చెలఁగి విడె మిచ్చేవు చెమటలు దుడిచేవు
యెలయింపు నీచేఁతల కే ముందును
వలపులు చల్లేవు వద్ద నిట్టె కూచుండేవు
బలిమి మాయకాఁడవు భళరా మెచ్చితిని
(॥ఇచ్చ॥)
చన్నులపయి నొరగేవు సారె గాఁగిలించేవు
యేన్నేసి నీ వినయాలు యే ముందును
యిన్నీటా శ్రీవెంకటేశ యిట్టే నన్నుఁ గూడితిని
పన్నినగండికాఁడవు భఁళరా మెచ్చితిని
(||pallavi||)
ichchagamu seya vachche vemaṁdunu
bachchĕna saḍagām̐ḍavu bhaḽarā mĕchchidini
(||ichcha||)
seyi vaṭṭi pĕnam̐gevu sĕkku nŏkka vachchevu
yīyĕḍa nīdo niṁka ne maṁdunu
sāyalagĕ navvevu sarasamu lāḍevu
pāyabuvagagām̐ḍavu bhaḽarā mĕchchidini
(||ichcha||)
sĕlam̐gi viḍĕ michchevu sĕmaḍalu duḍisevu
yĕlayiṁpu nīsem̐tala ke muṁdunu
valabulu sallevu vadda niṭṭĕ kūsuṁḍevu
balimi māyagām̐ḍavu bhaḽarā mĕchchidini
(||ichcha||)
sannulabayi nŏragevu sārĕ gām̐giliṁchevu
yennesi nī vinayālu ye muṁdunu
yinnīḍā śhrīvĕṁkaḍeśha yiṭṭe nannum̐ gūḍidini
panninagaṁḍigām̐ḍavu bham̐ḽarā mĕchchidini