ఇచ్చకము సేసితేను ఇయ్యకోవద్దా
(॥పల్లవి॥)
ఇచ్చకము సేసితేను ఇయ్యకోవద్దా
పచ్చిదేర నవ్వితేను పదరుదురా
(॥ఇచ్చ॥)
విరులు ముడిచేనంటా విభుఁడు కొప్పువట్టితే
సరుగన నీ విట్లా జంకింతురా
పరగ హారాలు గట్ట బయ్యద దీసితేను
వొరసి చేతుల నిట్టె వొడ్డించుకొందురా
(॥ఇచ్చ॥)
చల్లఁ గావలసి మేన సారెఁ బన్నీరు చల్లఁగా
పెల్లున నాతనితోడ బెనఁగుదురా
వొల్లనే కుచ్చెల జారకుండా మొలనూలిడితే
వుల్లసాలాడుకొంటా వొట్లు వెట్టుదురా
(॥ఇచ్చ॥)
సిగ్గు దేరవెనంటా చెలితో మాఁటాడరాఁగా
వెగ్గళించి తామరను విసరుదురా
అగ్గమై శ్రీవేంకటేశుఁ డాదరించి నిన్నుఁ గూడె
నిగ్గుల నీ వింతలోనే నివ్వెర గందుదురా
(||pallavi||)
ichchagamu sesidenu iyyagovaddā
pachchidera navvidenu padarudurā
(||ichcha||)
virulu muḍisenaṁṭā vibhum̐ḍu kŏppuvaṭṭide
sarugana nī viṭlā jaṁkiṁturā
paraga hārālu gaṭṭa bayyada dīsidenu
vŏrasi sedula niṭṭĕ vŏḍḍiṁchugŏṁdurā
(||ichcha||)
sallam̐ gāvalasi mena sārĕm̐ bannīru sallam̐gā
pĕlluna nādanidoḍa bĕnam̐gudurā
vŏllane kuchchĕla jāraguṁḍā mŏlanūliḍide
vullasālāḍugŏṁṭā vŏṭlu vĕṭṭudurā
(||ichcha||)
siggu deravĕnaṁṭā sĕlido mām̐ṭāḍarām̐gā
vĕggaḽiṁchi tāmaranu visarudurā
aggamai śhrīveṁkaḍeśhum̐ ḍādariṁchi ninnum̐ gūḍĕ
niggula nī viṁtalone nivvĕra gaṁdudurā